మీ ముఖాలు అద్దంలో చూసుకోండి... భూమా! విడాకులు ఇవ్వకుండా వెళ్లి కులికేందుకు సిగ్గుందా?
తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే జగన్ తన పార్టీ మూసేస్తారా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి చేసిన సవాల్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ముందు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రు లాంటి వారు ముఖాలను అద్దంలో చూసుకోవాలన్నారు. తమది తాతల కాలం నుంచే రిచ్ ఫ్యామిలీ అని భూమా చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు. మీ తాతాలు నేతులు తాగి ఉండవచ్చు.. మీ మూతులు మాత్రం ఇప్పుడు కంపు […]
తాము ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే జగన్ తన పార్టీ మూసేస్తారా అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి చేసిన సవాల్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ముందు భూమా నాగిరెడ్డి, జ్యోతుల నెహ్రు లాంటి వారు ముఖాలను అద్దంలో చూసుకోవాలన్నారు. తమది తాతల కాలం నుంచే రిచ్ ఫ్యామిలీ అని భూమా చెప్పడాన్ని అంబటి ఎద్దేవా చేశారు. మీ తాతాలు నేతులు తాగి ఉండవచ్చు.. మీ మూతులు మాత్రం ఇప్పుడు కంపు కొడుతున్నారని విమర్శించారు.
పచ్చి రాజకీయ వ్యభిచారం చేస్తూ సిగ్గు లేకుండా తిరిగి సవాల్ విసురుతారా అని ప్రశ్నించారు. సిగ్గులజ్జా, దమ్ము ధైర్యం ఉంటే ముందు రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు. ఇప్పటి వరకు కనీసం రాజీనామా లేఖలు కూడా ఇచ్చే ధైర్యం లేని పిరికివాళ్లు మీరంటూ మండిపడ్డారు. ఒకవేళ 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికల్లో ఓడిపోతే చంద్రబాబు టీడీపీని మూసివేస్తారా అని అంబటి సవాల్ చేశారు.
భూమా విసిరిన సవాల్‌కు తాము సిద్దమని … అదే సవాల్‌కు చంద్రబాబు నిలబడేలా చేయాలని అంబటి కౌంటర్ ఇచ్చారు. విడాకులు ఇచ్చి ఎవరు ఎక్కడ తిరిగినా తమకు అభ్యంతరం లేదని కానీ… విడాకులు కూడా ఇవ్వకుండానే మరొకరి దగ్గర కులుకుతున్న వ్యభిచారాలు 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు అని అంబటి ఫైర్ అయ్యారు. పార్టీ మారితే రాజీనామా చేయాలని చట్టం చెబుతోందని … కానీ ఆ పనిచేయకుండా భూమా నాగిరెడ్డి సవాల్ చేయడాన్ని ఏమనాలన్నారు.
ఎన్నికలకు వెళ్తే ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజలను చీపుర్లతో కొడుతారని అంబటి హెచ్చరించారు. భూమాతో పాటు జ్యోతుల నెహ్రు, ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ తమ మాటలు వర్తిస్తాయని అంబటి ప్రకటించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా దొంగలని విమర్శించారు. తాము డబ్బులకు అమ్ముడుపోలేదు చంద్రబాబు గొప్పతనం చూసి పార్టీ మారామని చెబితే నమ్మేందుకు ప్రజలు చెవిలో పూలు పెట్టుకోలేదన్నారు.
Click on Image to Read: