Telugu Global
Cinema & Entertainment

గల్లా బావతో... ఘట్టమనేని బావమరిది సినిమా...

ఒకరేమో పెద్ద పారిశ్రామికవేత్త, అంతకుమించి లోక్ సభ సభ్యుడు (ఎంపీ). మరొకరేమో టాలీవుడ్ అందగాడు. అంతకుమించి సూపర్ స్టార్. ఇద్దరూ బంధువులే. వాళ్లే గల్లా జయదేవ్, హీరో మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలకు గల్లా జయదేవ్ సపోర్ట్ అవసరం లేదు. అలా ఎప్పుడూ జరగలేదు కూడా. కానీ జయదేవ్ విషయంలో మాత్రం పలు మార్లు మహేష్ బాబు మద్దతు ప్రకటించాడు. తన ఫుల్ సపోర్ట్ అందించాడు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇప్పుడీ […]

గల్లా బావతో... ఘట్టమనేని బావమరిది సినిమా...
X
ఒకరేమో పెద్ద పారిశ్రామికవేత్త, అంతకుమించి లోక్ సభ సభ్యుడు (ఎంపీ). మరొకరేమో టాలీవుడ్ అందగాడు. అంతకుమించి సూపర్ స్టార్. ఇద్దరూ బంధువులే. వాళ్లే గల్లా జయదేవ్, హీరో మహేష్ బాబు. మహేష్ బాబు సినిమాలకు గల్లా జయదేవ్ సపోర్ట్ అవసరం లేదు. అలా ఎప్పుడూ జరగలేదు కూడా. కానీ జయదేవ్ విషయంలో మాత్రం పలు మార్లు మహేష్ బాబు మద్దతు ప్రకటించాడు. తన ఫుల్ సపోర్ట్ అందించాడు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇప్పుడీ అనుబంధమే వ్యాపార బంధంగా కూడా మారబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే గల్లా జయదేవ్ నిర్మాతగా… మహేష్ బాబు హీరోగా ఓ భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. నిజానికి గల్లా జయదేవ్ నిర్మాతగా… ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా రాబోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ మహేష్ బాబు సినిమాతోనే నిర్మాతగా మారాలని గల్లా జయదేవ్ భావిస్తున్నారట. మహేష్ సోదరి మంజులకు నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించాలని గల్లా జయదేవ్ భావిస్తున్నారట. మరోవైపు మహేష్ బాబుకు కూడా ఓ సొంత బ్యానర్ ఉంది. సో… గల్లా జయదేవ్ నిర్మాత, మహేష్ బాబు సహ-నిర్మాత, హీరోగా త్వరలోనే సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది.
First Published:  15 Jun 2016 5:34 AM GMT
Next Story