పార్టీ సమావేశానికి హాజరుకాని కొందరు ఎమ్మెల్యేలు
విజయవాడలో జరుగుతున్న వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్ రెడ్డి, రోజా, గిడ్డి ఈశ్వరి, ముస్తఫా సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సమావేశానికి వచ్చినా మరో పని మీద వెంటనే వెళ్లిపోయారు. రోజా విదేశాల్లో ఉన్నట్టు చెబుతున్నారు. సోదరుడు మృతి కారణంగా గిడ్డి ఈశ్వరి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాలేదని భావిస్తున్నారు. వారం పదిరోజులుగా ఆయన పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. […]

విజయవాడలో జరుగుతున్న వైసీపీ విస్తృతస్థాయి సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు అమర్‌నాథ్ రెడ్డి, రోజా, గిడ్డి ఈశ్వరి, ముస్తఫా సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సమావేశానికి వచ్చినా మరో పని మీద వెంటనే వెళ్లిపోయారు. రోజా విదేశాల్లో ఉన్నట్టు చెబుతున్నారు. సోదరుడు మృతి కారణంగా గిడ్డి ఈశ్వరి కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాలేదని భావిస్తున్నారు. వారం పదిరోజులుగా ఆయన పార్టీ వీడుతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలతో సంప్రదింపులుకూడా పూర్తయ్యాయని చెబుతున్నారు.
Click on Image to Read: