Telugu Global
NEWS

బైరెడ్డిపై దాడి చేసింది ప్రజలా? పచ్చ దండా?

తాను మాస్ లీడర్‌ కాకపోయినా ఒక్కో ఊరిలో  కనీసం పదిమందికైనా సీమకు జరుగుతున్న అన్యాయంపై ఆలోచన కలిగించాలన్న ఉద్దేశంతో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఊరూరా తిరుగుతున్నారు. వేలాది మంది తరలిరాకపోయినా ఆయన చెప్పే మాటలను ప్రతి గ్రామంలోని వారు ఆసక్తిగానే వింటున్నారు. ఇప్పటికిప్పుడు వారంతా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించకపోయినా బైరెడ్డి పర్యటనతో ఒక ఆలోచన వారిలో మొదలైంది. బైరెడ్డి తన టూర్‌లో రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా […]

బైరెడ్డిపై దాడి చేసింది ప్రజలా? పచ్చ దండా?
X

తాను మాస్ లీడర్‌ కాకపోయినా ఒక్కో ఊరిలో కనీసం పదిమందికైనా సీమకు జరుగుతున్న అన్యాయంపై ఆలోచన కలిగించాలన్న ఉద్దేశంతో రాయలసీమ రాష్ట్ర సాధన సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఊరూరా తిరుగుతున్నారు. వేలాది మంది తరలిరాకపోయినా ఆయన చెప్పే మాటలను ప్రతి గ్రామంలోని వారు ఆసక్తిగానే వింటున్నారు. ఇప్పటికిప్పుడు వారంతా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించకపోయినా బైరెడ్డి పర్యటనతో ఒక ఆలోచన వారిలో మొదలైంది.

బైరెడ్డి తన టూర్‌లో రాయలసీమకు చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చాపకింద నీరులా ఇది టీడీపీకి ఇబ్బంది కలిగించే పరిణామమే. అయితే ఇలా సీమకోసం సీమలోనే పర్యటిస్తున్న బైరెడ్డిపై కోడిగుడ్లతో దాడి చేయడం చర్చనీయాంశమైంది. అందుకు టీడీపీ అనుకూల పత్రికలు చెబుతున్న కారణం కూడా భలే గమ్మత్తుగా ఉంది. చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు అని బైరెడ్డి చెప్పగానే ప్రజలు ఆగ్రహంతో కోడిగుడ్లతో కొట్టి సమాధానం చెప్పారంటూ కసితీరా టీడీపీ అనుకూల పత్రిక ప్రధాన సంచికలోనే అచ్చేసింది. కానీ రుణమాఫీ చేయడం లేదు అనగానే కోడిగుడ్లు విసిరేంత అమాయకులు ఎవరూ కడప జిల్లాలో లేరు. కానీ..

బైరెడ్డిపై దాడి జరిగింది టీడీపీ అనుకూల గ్రామంలో. లింగాల మండలం పార్నపల్లిల్లో ఈ దాడి జరిగింది. ఈ దాడి వెనుక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి వర్గం హస్తముందని కూడా చెబుతున్నారు. అంటే సీమ టీడీపీ నేతలు రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై జనంలో చైతన్యం పెరగకూడదని కోరుకుంటున్నారన్న మాట. కడప రౌడీలు, పులివెందుల ఫ్యాక్షనిస్టులు అని చంద్రబాబు పదేపదే అంటున్నా కడప, పులివెందులను తిట్టారంటే తమను కాదు జగన్‌ను అని తుడుచుకుని తిరుగుతారన్న మాట. శ్రీశైలంలో కనీస నీటిమట్టం నిబంధనను అమలు చేయించలేని వారు కూడా మీసాలు పెంచుకుని అధికారపార్టీ నేతలుగా సీమలో తిరగడమూ గొప్పవిషయమే. రాయలసీమలో చైతన్యం కోసం పర్యటిస్తున్న బైరెడ్డిపై కోడి గుడ్లు వేయించడం ద్వారానే బానిస మనస్తత్వాన్ని టీడీపీ నేతలు బయటపెట్టుకున్నారు.

Click on Image to Read:

YSRCP-Extensive-Meeting

gottipati

gutta-motukupally

darmana

bhumana-karunakar-reddy

bhuma-jyotula

dasari-narayana-rao

kapu-leaders-meeting-in-par

somireddy

V-Hanumantha-Rao-1

anam-ramanarayana-reddy

trivikaram

t-congress

jc-diwakar-reddy

mudragada-son

anna-canteens

First Published:  14 Jun 2016 9:07 AM IST
Next Story