ప్రపంచంలో ప్రసవసమయంలో మరణిస్తున్న ప్రతి నలుగురిలో.... ఒకరు భారతీయ స్త్రీ!
ఈ వార్త విన్న తరువాత దేశం ముందుకు వెళ్తున్నదనే వారు ఎవరైనా కాస్త ఆలోచించి తీరాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రసవమరణాల్లో నాల్గవవంతు భారత్‌లోనే సంభవిస్తున్నాయి. దేశంలో ప్రతి అయిదు నిముషాలకు ఒకసారి గర్భధారణలో సమస్యలతోనూ, లేదా ప్రసవ సమయంలో అనారోగ్యాలతోనూ ఒక మహిళ మరణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల ప్రెగ్నెన్సీ సంబంధ మరణాలు నమోదు అయితే అందులో 1.36 లక్షల మంది భారత స్త్రీలే. ఇందులో […]
ఈ వార్త విన్న తరువాత దేశం ముందుకు వెళ్తున్నదనే వారు ఎవరైనా కాస్త ఆలోచించి తీరాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ప్రసవమరణాల్లో నాల్గవవంతు భారత్‌లోనే సంభవిస్తున్నాయి. దేశంలో ప్రతి అయిదు నిముషాలకు ఒకసారి గర్భధారణలో సమస్యలతోనూ, లేదా ప్రసవ సమయంలో అనారోగ్యాలతోనూ ఒక మహిళ మరణిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో ఈ నిజాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 5.29 లక్షల ప్రెగ్నెన్సీ సంబంధ మరణాలు నమోదు అయితే అందులో 1.36 లక్షల మంది భారత స్త్రీలే.
ఇందులో ఎక్కువ మరణాలకు డెలివరీ తరువాత విపరీత రక్తస్రావాన్ని కలిగించే పోస్ట్పార్టమ్ హెమరేజ్ కారణంగా ఉంది. భారత్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. 2011-2013 లో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో మాతృత్వ మరణాల రేటు సగటున ప్రతి లక్ష జననాలకు 167 మరణాలుగా ఉంది. ఈ మరణాల రేటు అసోంలో అత్యధికం (300) గానూ, కేరళలో అతి తక్కువ (67)గానూ ఉంది.
భారత్లో రక్తం కొరత చాలా ఎక్కువగా ఉందని కూడా ఈ నివేదిక చెబుతోంది. దేశంలోని జనాభా సంఖ్యకు 12మిలియన్ యూనిట్ల రక్తాన్ని ఏటా సేకరించాల్సి ఉండగా, తొమ్మిది మిలియన్ యూనిట్లను మాత్రమే సేకరించగలుగుతున్నారు. గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్తలేమి తదితర కారణాలతో పాటు ఇది కూడా ప్రసవ మరణాలను పెంచుతున్నది. పేషంటులో రక్తం స్థాయిని సరిపడా ఉండేలా చేయటంలో ప్రపంచవ్యాప్తంగా అనేక విధానాలు అమల్లో ఉండగా భారత్ ఇలాంటి అవగాహన విషయంలో చాలా వెనుకబడి ఉందని, ఈ సమస్యని నిర్లక్ష్యం చేస్తోందని కూడా నివేదిక పేర్కొంది.