బస్ నడుపుతుండగా గుండెపోటు...ప్రయాణీకులను కాపాడి డ్రైవర్ మృతి!
బస్‌ని నడుపుతూ హఠాత్తుగా గుండెపోటుకి గురయిన ఒక డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రషీద్ అనే ఆ డ్రైవరు సోమవారం మధ్యాహ్నం మామూలుగానే తన డ్యూటీలో ఉన్నాడు. ఖాండ్వా అనే ఊరు నుండి కోహడర్ అనే ఊరికి వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్ అది. చోటీ బోర్గాన్ అనే గ్రామానికి చేరేసరికి రషీద్‌కి గుండెనొప్పి మొదలైంది. ఒక్కసారిగా నొప్పి తీవ్రం కావటంతో అతనికి తన […]

బస్‌ని నడుపుతూ హఠాత్తుగా గుండెపోటుకి గురయిన ఒక డ్రైవర్ ప్రయాణీకుల ప్రాణాలు కాపాడి తాను ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రషీద్ అనే ఆ డ్రైవరు సోమవారం మధ్యాహ్నం మామూలుగానే తన డ్యూటీలో ఉన్నాడు. ఖాండ్వా అనే ఊరు నుండి కోహడర్ అనే ఊరికి వెళుతున్న ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్ అది. చోటీ బోర్గాన్ అనే గ్రామానికి చేరేసరికి రషీద్‌కి గుండెనొప్పి మొదలైంది. ఒక్కసారిగా నొప్పి తీవ్రం కావటంతో అతనికి తన పరిస్థితి అర్థమైంది. నొప్పి బాధపెడుతున్నా ఓర్చుకుంటూ, బస్మీద కంట్రోల్ని కోల్పోకుండా అతి కష్టంమీద దాన్ని ఆపగలిగాడు.
రోడ్డు పక్కకు వెళ్లిపోయిన బస్, ఓ చెట్టుకి సమీపంలో ఆగిపోయింది. ప్రయాణీకులు డ్రైవర్ పరిస్థితిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అత్యవసర వైద్య సహాయం కోసం ప్రయత్నించారు. కానీ వైద్య సహాయం అందేలోపలే రషీద్ ప్రాణాలు కోల్పోయాడు. తమ ప్రాణాలను కాపాడిన డ్రైవర్, కళ్లముందే మరణించడంతో బస్‌లో ఉన్న 29మంది ప్రయాణీకులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు. పోలీసులు కాస్త త్వరగా స్పందించి ఉంటే అతను బతికేవాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.