హర్లీక్విన్ బేబీ చనిపోయింది!
చర్మం లేకుండా పుట్టిన హర్లీక్విన్ బేబీ చనిపోయింది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన 23ఏళ్ల మహిళకు నాగపూర్‌లోని లతామంగేష్కర్ ఆసుపత్రిలో శనివారం ఈ శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. వైద్య రికార్డుల ప్రకారం మనదేశంలో ఈ విధంగా జన్మించిన మొదటి శిశువు ఈ పాప. ప్రతి మూడులక్షల జననాల్లో ఒకరు ఈ విధంగా హర్లీక్విన్ డిజార్డర్‌తో జన్మించే అవకాశం ఉంది. ఈ శిశువులకు చర్మం ఏర్పడదు. శరీరం పైన మందపాటి పొర ఏర్పడి, లోపలి శరీర భాగాలు కనబడుతుంటాయి. […]
చర్మం లేకుండా పుట్టిన హర్లీక్విన్ బేబీ చనిపోయింది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన 23ఏళ్ల మహిళకు నాగపూర్‌లోని లతామంగేష్కర్ ఆసుపత్రిలో శనివారం ఈ శిశువు జన్మించిన సంగతి తెలిసిందే. వైద్య రికార్డుల ప్రకారం మనదేశంలో ఈ విధంగా జన్మించిన మొదటి శిశువు ఈ పాప. ప్రతి మూడులక్షల జననాల్లో ఒకరు ఈ విధంగా హర్లీక్విన్ డిజార్డర్‌తో జన్మించే అవకాశం ఉంది. ఈ శిశువులకు చర్మం ఏర్పడదు. శరీరం పైన మందపాటి పొర ఏర్పడి, లోపలి శరీర భాగాలు కనబడుతుంటాయి. నాగపూర్లో జన్మించిన ఈ పాపని వైద్యులు ఐసియు ఇంక్యుబేటర్లో ఉంచి పర్యవేక్షిస్తుండగా సోమవారం మరణించింది. ఈ డిజార్డర్తో జన్మించినవారు పుట్టిన గంటల వ్యవధిలోనే మరణిస్తారని, అరుదుగా కొన్నేళ్లు జీవించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.