వైఎస్ వల్ల అద్దెకు గదులు కూడా దొరకడం లేదన్నారు... ఇప్పుడూ అదే చేస్తున్నారు
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశంలో మాట్లాడిన వైసీపీనేత భూమన కరుణాకర్ రెడ్డి…. జగన్‌పై టీడీపీ పాశవికమైన దాడి చేస్తోందన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గతంలో వైఎస్‌పైనా ఇలాగే దాడి చేశారన్నారు. వైఎస్ తమ జిల్లాకు చెందిన వాడు కావడంతో విజయవాడ, హైదరాబాద్‌లో అద్దెకు గదులు కూడా ఇవ్వడం లేదని గతంలో కొందరు ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వైఎస్‌ను తెలుగు ప్రజలు దేవుడిగా చూస్తున్నారని చెప్పారు. గతంలో వైఎస్ వ్యక్తిత్వాన్ని […]
విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్తాయి సమావేశంలో మాట్లాడిన వైసీపీనేత భూమన కరుణాకర్ రెడ్డి…. జగన్‌పై టీడీపీ పాశవికమైన దాడి చేస్తోందన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందన్నారు. గతంలో వైఎస్‌పైనా ఇలాగే దాడి చేశారన్నారు. వైఎస్ తమ జిల్లాకు చెందిన వాడు కావడంతో విజయవాడ, హైదరాబాద్‌లో అద్దెకు గదులు కూడా ఇవ్వడం లేదని గతంలో కొందరు ప్రచారం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వైఎస్‌ను తెలుగు ప్రజలు దేవుడిగా చూస్తున్నారని చెప్పారు. గతంలో వైఎస్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్టుగానే జగన్ విషయంలోనూ టీడీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు.
జగన్ వ్యక్తిత్వం మీద దాడి చేస్తేనే వైసీపీ బలహీనపడుతుందన్న కుట్రను చంద్రబాబు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. కానీ జగన్ చెక్కుచెదరలేదన్నారు. గెలుపు అంచుల వరకు వెళ్లి కూడా తప్పుడు హామీలు ఇవ్వకూడదన్న సచ్చీలతతో అధికారానికి దూరమైన వ్యక్తి జగన్ అని అన్నారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని కూడా హత్తుకున్న వ్యక్తి ప్రపంచంలో జగన్ తప్ప ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పార్టీనుంచి వీడిపోయిన తోలుబొమ్మలతో కూడా చంద్రబాబు ప్రకటనలు ఇప్పిస్తున్నారన్నారని ఎద్దేవా చేశారు.
పార్టీ ఫిరాయించిన వారు కూడా జగన్ వ్యక్తిత్వంపై మాట్లాడడం చూస్తుంటే రాజకీయాలను చంద్రబాబు ఎంత దిగజారుస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్‌పై జరుగుతున్నపైశాచిక దాడిని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. లక్ష్యం సాధించే వరకు కష్టాలు ఎన్నివచ్చినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా, కన్నీరు వచ్చినా వెనుదిరగకూడదన్నారు. ధిక్కరిస్తున్నాడని, ఎదురొస్తున్నాడనే జగన్‌పై సోనియాగాంధీ, చంద్రబాబు కలిసి తప్పుడు కేసులు పెట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఒరికిద్దరు నాయకులు పోయినంతమాత్రాన అదిరేది, బెదిరేది లేదన్నారు. వైసీపీ ఆస్తి జగన్ వ్యక్తిత్వమేనన్నారు భూమన.
Click on Image to Read: