నాలుగు రోజులు ఆగివుంటే చాన్స్ వచ్చేది... ఆయన వల్లే కాంగ్రెస్‌ను జగన్ వదిలేశాడు
2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఆంధ్రాలో కూడా ఫాలోయింగ్ ఉందని చెప్పారు. తాను వెళ్తే జనం గుంపు అవుతారని చెప్పారు. తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానన్నారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్‌లో తన కింద పనిచేశారని ఆయన టైమ్ బాగుండి సీఎం అయ్యారన్నారు. జానారెడ్డి , ఉత్తమ్‌ను విమర్శించడం సరికాదన్నారు. జగన్ కాంగ్రెస్‌ను వీడడానికి తాను కారణం కాదన్నారు. జగన్ పార్టీ వీడడానికి […]
2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధీమా వ్యక్తం చేశారు. తనకు ఆంధ్రాలో కూడా ఫాలోయింగ్ ఉందని చెప్పారు. తాను వెళ్తే జనం గుంపు అవుతారని చెప్పారు. తెలంగాణ మొత్తం పర్యటించి కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానన్నారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్‌లో తన కింద పనిచేశారని ఆయన టైమ్ బాగుండి సీఎం అయ్యారన్నారు. జానారెడ్డి , ఉత్తమ్‌ను విమర్శించడం సరికాదన్నారు.
జగన్ కాంగ్రెస్‌ను వీడడానికి తాను కారణం కాదన్నారు. జగన్ పార్టీ వీడడానికి కేవీపీయే కారణమన్నారు. వైఎస్ మృతదేహం ఉండగానే సంతకాలు చేయించింది కేవీపీయేనని అన్నారు. దాని వల్ల కథ అడ్డం తిరిగిందని చెప్పారు. నాలుగు రోజులు ఆగిఉంటే జగన్‌కు మంచి అవకాశం వచ్చేదన్నారు. జగన్‌ను సీఎం చేయాలన్న తాపత్రయంతో కేవీపీ వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం సంతకాల సేకరణ చేసిన కేవీపీ బాగానే ఉన్నారని…జగన్ మాత్రం ఊర్లుపట్టుకుని తిరుగుతున్నాడని వీహెచ్ అన్నారు.
Click on Image to Read: