జగన్ అంటే భయమా? కోర్టులంటే చులకనా?
టీడీపీ నేతల డిమాండ్లు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి ఇప్పుడు ఏకంగా కోర్టుల ముందే డిమాండ్ పెట్టారు. రాష్ట్రంలో జగన్ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలపై నమోదైన అవినీతి కేసులను ఏడాదిలో పరిష్కరించాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందని సోమిరెడ్డి…. కింది కోర్టులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జగన్‌కు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని కోర్టులను నిలదీశారు. […]

టీడీపీ నేతల డిమాండ్లు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి ఇప్పుడు ఏకంగా కోర్టుల ముందే డిమాండ్ పెట్టారు. రాష్ట్రంలో జగన్ శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. ఇలాంటి వ్యక్తిని ఉపేక్షించకూడదన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలపై నమోదైన అవినీతి కేసులను ఏడాదిలో పరిష్కరించాలని గతంలో సుప్రీం కోర్టు చెప్పిందని సోమిరెడ్డి…. కింది కోర్టులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
జగన్‌కు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని కోర్టులను నిలదీశారు. రెండేళ్లు అవుతున్నా జగన్ కేసులో ఒక్క జడ్జిమెంట్ కూడా రావడం లేదని సోమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సోమిరెడ్డి ఒక విషయం మరిచినట్లుగా వున్నారు. నేతల కేసులను ఒక ఏడాదిలో కోర్టులు పరిష్కరిస్తే ఈపాటికి ఓటుకు నోటు కేసులో రేవంత్‌తోపాటు ఇంకా ఎవరెవరు టిడిపీ నాయకులు జైలులో ఉండేవారో? మొత్తానికి జగన్ బయట ఉంటే టీడీపీ నేతలు ఎందుకింత ఆందోళన చెందుతున్నారో? కోర్టులకు కూడా టీడీపీ నేతలు విధులు గుర్తు చేయడం గొప్పవిషయమే?
Click on Image to Read: