Telugu Global
Cinema & Entertainment

బూతులు తిట్టించుకుంటున్న త్రివిక్రం శ్రీనివాస్‌

త్రివిక్రం శ్రీనివాస్‌ చదువుకున్న వ్యక్తి. సంస్కారవంతుడు. మాటల రచయితగా, దర్శకుడిగా విజయవంతమైన మేధావి. వివాదాల జోలికి వెళ్లని ఆయన ఇటీవల తీసిన “అ..ఆ” సినిమాలో అవసరంలేకపోయినా, అసందర్భంగా ఒక దొంగపాత్రను పెట్టి కులం పేరుతో దొంగకు ఒక పేరుపెట్టి రెండు సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ రెండు సన్నివేశాల్లోను ఆ దొంగ పేరు, వాళ్ల బంధువుల పేర్లు, వాళ్ల కులం అవసరం లేకపోయినా ప్రస్తావనకు వస్తాయి. గత మూడు, నాలుగు దశాబ్దాలలో ఒక సామాజిక వర్గం చేతిలోకి సినీ […]

బూతులు తిట్టించుకుంటున్న త్రివిక్రం శ్రీనివాస్‌
X

త్రివిక్రం శ్రీనివాస్‌ చదువుకున్న వ్యక్తి. సంస్కారవంతుడు. మాటల రచయితగా, దర్శకుడిగా విజయవంతమైన మేధావి. వివాదాల జోలికి వెళ్లని ఆయన ఇటీవల తీసిన “అ..ఆ” సినిమాలో అవసరంలేకపోయినా, అసందర్భంగా ఒక దొంగపాత్రను పెట్టి కులం పేరుతో దొంగకు ఒక పేరుపెట్టి రెండు సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ రెండు సన్నివేశాల్లోను ఆ దొంగ పేరు, వాళ్ల బంధువుల పేర్లు, వాళ్ల కులం అవసరం లేకపోయినా ప్రస్తావనకు వస్తాయి.

గత మూడు, నాలుగు దశాబ్దాలలో ఒక సామాజిక వర్గం చేతిలోకి సినీ పరిశ్రమ వెళ్లిపోయాక తెలుగు సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్‌ వచ్చింది. ఒక హాస్య నటుడిచేత పూజారి వేషం వేయించి, లేదా బ్రాహ్మణుడి వేషం వేయించి అతన్ని తిట్టడం, కొట్టడం, కాలితో తన్నడం, అవమానించడం వంటి సన్నివేశాలు చిత్రీకరించేవాళ్లు.

ఆ తరువాత తెలంగాణ వాళ్లను అవమానించడం ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు. విలన్‌లకు, రౌడీలకు తెలంగాణ యాస పెట్టడం, చెడ్డపనులు చేసే వాళ్లకు తెలంగాణ పేర్లు పెట్టడం, చివరకు తెలంగాణ మహిళా విలన్‌లను కూడా తెరకెక్కించేవారు.

అదే సమయంలో గొప్ప వ్యక్తులకు, గొప్ప వంశాలకు, గొప్ప పనులు చేసేవాళ్లకు సినీపరిశ్రమను గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ల కులం పేరు వ్యక్తమయ్యేలా ఇంటి పేర్లు పెడుతున్నారు.

అదే సమయంలోనూ, ఆ తరువాత కూడా రాయలసీమ వాళ్లకు ఇంకేమీ పని లేదనట్టు చంపుకోవడాలు, నరుక్కోవడాలే దినచర్య అన్నట్టు, రాయలసీమ వీధుల్లో రక్తాలు మాత్రమే ప్రవహిస్తాయి అన్నట్టు సన్నివేశాలు వుండేవి. కాస్త ట్రెండ్‌ మారి ఇటీవల కాలంలో చెడ్డపనులు, నీచపు పనులు చేసేవాళ్లకు, దుర్మార్గులకు రెడ్డి అనే పేరు తగిలించి ఒక సామాజిక వర్గాన్ని అవమానపరుస్తున్నారు. అంతటితో ఆగకుండా స్త్రీలకు కూడా రెడ్డి అనే పేరు తగిలించి వాళ్లను నీచంగా చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి సినిమాలు చూశాక రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు. నెటిజెన్లు అయితే కోపాన్ని అణుచుకోలేక ఆ సినిమా దర్శకులను, నిర్మాతలను, అలాంటి సినిమాలు తీస్తున్న సామాజిక వర్గాన్ని పచ్చి బూతులు తిడుతూ కామెంట్లు, పోస్టులు పెడుతున్నారు. వాళ్ల వంశ చరిత్రలను, వాళ్ల కుటుంబ చరిత్రలను, వీధుల్లోకి లాగుతున్నారు.

ఇప్పటివరకు అలాంటి బూతులు తిట్టించుకునే అవకాశం ఒక సామాజికవర్గానికే దక్కింది. ఇటీవల మంచువిష్ణు సినిమాలో బ్రాహ్మణ యువతిని నీచంగా చిత్రీకరించారని రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు పెద్ద ఉద్యమమే చేశారు. ఇవ్వన్నీ చూసి కూడా త్రివిక్రం శ్రీనివాస్‌కు ఏమైందో తెలియదుగానీ తన సినిమాలో రెడ్లను అవమానపరిచి బూతులు తిట్టించుకుంటున్నాడు. ఆయనపై నెటిజెన్‌ల ఆగ్రహం చూస్తే బహుశా ఇంకోసారి ఇలాంటి పాత్రలు సృష్టించడేమో..!

Click on Image to Read:

t-congress

rashi-khanna

V-Hanumantha-Rao-1

anam-ramanarayana-reddy

jc-diwakar-reddy

mudragada-son

anna-canteens

janareddy-jeevan-reddy

kapu community

harirama-jogaiah

siddhi-ramaiah

chandrababu-1

pawan-joker

balakrishna

First Published:  13 Jun 2016 7:31 AM IST
Next Story