బట్టలు చించికొట్టారు... అలా చెప్పడానికి హోంమంత్రికి సిగ్గుండాలి
ముద్రగడ అరెస్ట్ సందర్భంగా పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆయన కుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన పెద్దకుమారుడు బాలు… ప్రభుత్వం తన తండ్రిని ఉగ్రవాదిలా చూస్తోందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని దీక్ష చేస్తుంటే వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారని చెప్పారు. తన తల్లికి వెన్నుముక సమస్య ఉన్నా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేశారన్నారు. తన తమ్ముడిని బట్టలు చించికొట్టారని కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు ఏం చేసినా అనుకున్నది సాధించే వరకు తన […]

ముద్రగడ అరెస్ట్ సందర్భంగా పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆయన కుమారుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన పెద్దకుమారుడు బాలు… ప్రభుత్వం తన తండ్రిని ఉగ్రవాదిలా చూస్తోందన్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలని దీక్ష చేస్తుంటే వందలాది మంది పోలీసులు ఇంట్లోకి చొరబడ్డారని చెప్పారు. తన తల్లికి వెన్నుముక సమస్య ఉన్నా బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనంలో పడేశారన్నారు.
తన తమ్ముడిని బట్టలు చించికొట్టారని కంటతడి పెట్టుకున్నారు. చంద్రబాబు ఏం చేసినా అనుకున్నది సాధించే వరకు తన తండ్రి దీక్ష కొనసాగుతుందన్నారు. తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. తన సోదరుడిని పోలీసులు కొడుతున్న దృశ్యాల వీడియోలు ఉన్నప్పటికీ .. తాము కొట్టలేదని హోంమంత్రి చినరాజప్ప చెప్పడం సిగ్గుచేటన్నారు. తమకు కాపులంతా అండగా నిలవాలని ముద్రగడ బాలు కోరారు.
Click on Image to Read: