ఫ్లోరిడా నైట్ క్లబ్‌లో మారణ కాండ...50మంది మృతి...53 మందికి గాయాలు!
అమెరికాలోని ఫ్లోరిడాలో ఆ దేశ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయే హత్యా కాండ జరిగింది. ఓర్లాండా సిటీలోని పల్స్ స్వలింగ సంపర్కుల నైట్ క్లబ్లోకి చొరబడిన అగంతకుడు జరిపిన కాల్పుల్లో యాభై మంది మరణించారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్లబ్లో అంతా ఒళ్లు మరచి నృత్యాలు చేస్తున్న సమయంలో ఒమర్ మతీన్ (29) అనే ఆ ఉన్మాది ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోయినట్టుగా బతికి ఉన్నవారు వెల్లడించారు. ఉన్మాది […]
అమెరికాలోని ఫ్లోరిడాలో ఆ దేశ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయే హత్యా కాండ జరిగింది. ఓర్లాండా సిటీలోని పల్స్ స్వలింగ సంపర్కుల నైట్ క్లబ్లోకి చొరబడిన అగంతకుడు జరిపిన కాల్పుల్లో యాభై మంది మరణించారు. 53 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్లబ్లో అంతా ఒళ్లు మరచి నృత్యాలు చేస్తున్న సమయంలో ఒమర్ మతీన్ (29) అనే ఆ ఉన్మాది ఒక్కసారిగా కాల్పులు మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోయినట్టుగా బతికి ఉన్నవారు వెల్లడించారు. ఉన్మాది గ్లాస్ సీలింగ్పై కూడా కాల్పులు జరపటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు నేలపై పడుకున్నవారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి రెండుగంటలకు క్లబ్ మూసే సమయంలో దుండగుడు లోపలికి ప్రవేశించి, తలుపులు మూసి అనేకమందిని బంధీలుగా చేసుకుని, కాల్పులకు తెగబడ్డాడు. ఆయుధాలతో క్లబ్లోకి ప్రవేశించిన దుండగుడు, బాధితులు తమని చంపవద్దని ప్రాధేయపడుతున్నా వినకుండా నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. కాల్పులపై కస్టమర్లను అలర్ట్ చేస్తూ క్లబ్ యాజమాన్యం మేసేజ్లు పంపినట్టుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్నపోలీసులు 70 వాహనాలతో క్లబ్ని చుట్టుముట్టారు. ఆయుధాలు నింపిన వాహనం సహాయంతో క్లబ్ లోపలికి ప్రవేశించారు. ఆదివారం తెల్లవారే సరికి (మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ) పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు దుండగుని కాల్చి చంపారు. లోపలే దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న వారిని బయటకు తెచ్చారు. ఓర్లాండోలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. హంతకుని తల్లిదండ్రులు ఆఫ్ఘానిస్తాన్ నుండి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు. వీరు ఫ్లోరిడాలోని పోర్ట్ సెయింట్ లూసీలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన కుమారుడు, తల్లితో కలిసి బయటకు వెళ్లగా ఇద్దరు స్వలింగ సంపర్కులైన మగవారు ముద్దుపెట్టుకోవటం చూసి ఆగ్రహానికి గురయ్యాడని, అదే ఈ ఘటనకు మూలమని ఒమర్ తండ్రి తెలిపాడు. తన కుమారుడికి ఏ తీవ్రవాద సంస్థలతోనూ సంబంధాలు లేవని, అతను మతవిద్వేషి కాదని ఆయన వెల్లడించాడు. 29 ఏళ్ల ఒమర్ మతీన్ సెక్యురిటీ గార్డుగా శిక్షణ పొందినట్టుగా తెలుస్తోంది. అతను ఐఎస్ ఉగ్రవాద సంస్థ భావజాలంతో ప్రభావితమైన వ్యక్తి కావచ్చని, అతనికి టెర్రరిస్టులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నది.
Click on Image to Read: