ఢిల్లీలోని అయిదు ఆసుపత్రులకు 600కోట్ల జరిమానా!
ఢిల్లీ ప్రభుత్వం అయిదు ప్రయివేటు ఆసుపత్రులపై నిబంధనల ఉల్లంఘనకు గాను భారీ జరిమానా విధించింది. పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనే నిబంధన మేరకు ఆ ఆసుపత్రులకు 1960-1990ల మధ్యకాలంలో రాయితీలపై భూమిని లీజుకి ఇవ్వగా ఆ అయిదు ఆసుపత్రులు ఆ నిబంధనని ఉల్లంఘించాయని, అందుకే జరిమానా విధించినట్టుగా వైద్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ హేమ్ ప్రకాష్ మీడియాకు తెలిపారు. పేదలకు ఔట్ పేషంట్ విభాగంలో 25శాతం మందికి, ఇన్పేషంట్ విభాగంలో 10శాతం మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని […]
ఢిల్లీ ప్రభుత్వం అయిదు ప్రయివేటు ఆసుపత్రులపై నిబంధనల ఉల్లంఘనకు గాను భారీ జరిమానా విధించింది. పేదలకు ఉచితంగా వైద్యం చేయాలనే నిబంధన మేరకు ఆ ఆసుపత్రులకు 1960-1990ల మధ్యకాలంలో రాయితీలపై భూమిని లీజుకి ఇవ్వగా ఆ అయిదు ఆసుపత్రులు ఆ నిబంధనని ఉల్లంఘించాయని, అందుకే జరిమానా విధించినట్టుగా వైద్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ హేమ్ ప్రకాష్ మీడియాకు తెలిపారు.
పేదలకు ఔట్ పేషంట్ విభాగంలో 25శాతం మందికి, ఇన్పేషంట్ విభాగంలో 10శాతం మందికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని భూమి లీజు కేటాయింపుల నిబంధనల్లో ఉండగా ఈ ఆసుపత్రులు అందుకు నిరాకరించాయి. 2007లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జరిమానాలు విధించినట్టుగా, జులై 9 లోపల చెల్లించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్య శాఖ జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. మా క్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్స్, శాంతి ముకుంద్ ఆసుపత్రి, ధరం శిలా క్యాన్సర్ ఆసుపత్రి, పుష్పావతి సింఘానియా రీసెర్చి ఇన్స్టిట్యూట్లకు ఈ జరిమానాలు విధించారు.
Click on Image to Read: