గుత్తా గులాబీ గూటికి చేరేదెప్పుడు?
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో ప్రతిష్టంబన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో భేటీ అనంతరం ఆయన మనసు మార్చుకున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకూడదని ఉత్తమ్ ఎంపీ గుత్తాను కోరినట్లు తెలిసింది. పార్టీలో ఉన్న ఇబ్బందులను, సమస్యలను తాను పరిష్కరిస్తానని ఆయన్ను బుజ్జగించారు ఉత్తమ్. […]
BY sarvi12 Jun 2016 3:38 AM IST
X
sarvi Updated On: 12 Jun 2016 6:34 AM IST
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో ప్రతిష్టంబన నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన గులాబీ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ తో భేటీ అనంతరం ఆయన మనసు మార్చుకున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకూడదని ఉత్తమ్ ఎంపీ గుత్తాను కోరినట్లు తెలిసింది. పార్టీలో ఉన్న ఇబ్బందులను, సమస్యలను తాను పరిష్కరిస్తానని ఆయన్ను బుజ్జగించారు ఉత్తమ్. ఈ సమావేశం తరువాత గుత్తా ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. ఇంతకీ గుత్తా పార్టీ మారుతున్నారా ? లేదా? అన్న విషయం సందిగ్దంలో పడింది. మరోవైపు ఉత్తమ్ మాత్రం.. గుత్తా పార్టీ మారతాడని తాను అనుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడమే ఇందుకు కారణం. కొంపదీసి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలమైన నేతల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండోసారి ఎంపీగా గెలుపొందారు. జిల్లాలో 1999-2004 వరకు టీడీపీ తరఫున ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో నల్లగొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా రెండోసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీలంతా పలుమార్లు సోనియాను కలిసి తెలంగాణ ఇవ్వాలని కోరారు. ఒకదశలో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా మారింది. ఆ సమయంలో ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. దీంతో పొన్నం ప్రభాకర్, కేశవరావు, సిరిసిల్ల రాజయ్య, కేశవరావులతోపాటు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. వాటిని వెంటనే ఎంపీలంతా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ నల్లగొండ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కారు గాలి వీచినా.. ఆయన తట్టుకుని ఎన్నికల్లో నెగ్గగలిగారు. తీరా ఇప్పుడు ఆయన పార్టీ మారతారన్న వార్తలు ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. వీటిని బలపరిచేలా ఆయన నర్మగర్భంగా మాట్లాడటంతో ఆయన పార్టీ మారతారనే అంతా అనుకుంటున్నారు. రెండురోజుల్లో ఆయన పార్టీ ఫిరాయింపు విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story