కాంగ్రెస్ నుంచి అన్నదమ్ముల జంప్
టీ కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15న వారిద్దరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సోమవారమే చేరాలని తొలుత భావించినా ముహుర్తం కోసం 15వరకు ఆగనున్నారు. వీరు పార్టీ వీడుతారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వివేక్ పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో మంతనాలు జరిపారు. వివేక్ పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే ప్రయత్నించారు. అయితే తనకు పార్టీలో గుర్తింపు […]
టీ కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15న వారిద్దరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. సోమవారమే చేరాలని తొలుత భావించినా ముహుర్తం కోసం 15వరకు ఆగనున్నారు. వీరు పార్టీ వీడుతారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం వివేక్ పెద్దపల్లి నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో మంతనాలు జరిపారు.
వివేక్ పార్టీ వీడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పెద్దలు గట్టిగానే ప్రయత్నించారు. అయితే తనకు పార్టీలో గుర్తింపు లేదంటూ వివేక్ అన్నారు. ఓడిపోతానని తెలిసి కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి నష్టపోయానని… అయినప్పటికీ తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండాపోయిందని వివేక్ విమర్శించినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి జానారెడ్డి, ఉత్తమ్ కూడా వివేక్ తో భేటీ అయ్యారు. పార్టీ వీడవద్దని కోరారు. ఆయన మాత్రం టీఆర్ఎస్ లో చేరేందుకే సిద్ధపడినట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమసమయంలో వివేక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత తీరా ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. ఎన్నికల్లో ఓడిపోయారు. వివేక్ చాన్స్‌ను విద్యార్థి నాయకుడు బాల్కాసుమన్ టీఆర్‌ఎస్ నుంచి కొట్టేసి ఎంపీగా గెలిచారు.
Click on Image to Read: