బాబ్బాబు... వెళ్లకండి ప్లీజ్!
మీ సమస్యలేంటి..? మీరెందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం.. రండి.. సమస్యలను సావధానంగా పరిష్కరించుందాం. దయచేసి పార్టీ మారే ఆలోచన మార్చుకోండి. ఈ మాటలు ఎవరివి? అనుకుంటున్నారా? టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వి.. ఆయన కాంగ్రెస్ నేతలతో చెబుతున్నవి. ఇటీవల ఉత్తమ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పటినుంచి గులాబీ పార్టీ వారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కారెక్కించే కార్యక్రమాన్ని చకచకా కానిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఉలిక్కిపడ్డ ఉత్తమ్ హైదరాబాద్ రాగానే.. బుజ్జగింపుల పర్వం […]
BY sarvi11 Jun 2016 2:30 AM IST
X
sarvi Updated On: 11 Jun 2016 3:43 PM IST
మీ సమస్యలేంటి..? మీరెందుకు పార్టీ మారాలనుకుంటున్నారు? ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం.. రండి.. సమస్యలను సావధానంగా పరిష్కరించుందాం. దయచేసి పార్టీ మారే ఆలోచన మార్చుకోండి. ఈ మాటలు ఎవరివి? అనుకుంటున్నారా? టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ వి.. ఆయన కాంగ్రెస్ నేతలతో చెబుతున్నవి. ఇటీవల ఉత్తమ్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అప్పటినుంచి గులాబీ పార్టీ వారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కారెక్కించే కార్యక్రమాన్ని చకచకా కానిస్తున్నారు. ఈ విషయం తెలిసి ఉలిక్కిపడ్డ ఉత్తమ్ హైదరాబాద్ రాగానే.. బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. వస్తూనే.. ముందుగా నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీ మారే ఆలోచనను పక్కనబెట్టాలని ఉత్తమ్ కోరినట్లు తెలిసింది.
మరోవైపు సీఎంను కలిసినట్లుగా చెబుతున్న వివేక్, వినోద్‌లతోపాటు ఇతరనేతలను ఫోన్‌లో బుజ్జగించారు. పార్టీ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా పరిష్కరించేందుకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించే యత్నం చేశారు. వెంటనే మాజీమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో మరో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్, వినోద్‌లు పాల్గొన్నారు. పార్టీపరంగా సమస్యలు ఉన్న మాటను అంగీకరిస్తూనే.. దశాబ్దాలుగా పార్టీ పదవులు అనుభవించి.. ఇప్పుడు పార్టీని వీడటం సరికాదని సర్దిచెప్పే యత్నం చేశారు. అవసరమైతే హైకమాండ్ సాయం తీసుకుందామని.. సమావేశంలో తీర్మానించారు. ఉత్తమ్ మాటలతో కొందరు మెత్తబడ్డారని తెలిసింది. మరోవైపు సీఎం కేసీఆర్‌ను ఫాం హౌజ్‌లో కలిసినట్లుగా వచ్చిన వార్తలను మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి ఖండించారు. 20 ఏళ్లుగా పార్టీలో ఉన్నానని, పదవుల కోసం పార్టీ మారే మనిషిని కాదని ఆయన ప్రకటన విడుదల చేశారు.
వీరందరితో శనివారం ఉత్తమ్ మరోసారి భేటీ కానున్నారు. అయితే, ఈ సమావేశానికి వీరంతా వస్తారా? వచ్చినా మెత్తబడతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరిలో మెజారిటీ సభ్యులు పార్టీ మారేందుకు ససేమీరా అంటున్నారు. అయితే, ఉత్తమ్ ఎంతమందిని ఆపగలుగుతారన్నది ఈ రోజుతో తేలిపోతుంది. ఎందుకంటే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 12 తరువాత ఎంపీ గుత్తా తోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ ఎస్‌లో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
Next Story