చెవుల్లో రొద..ఆరోగ్యానికి బెడద!
నగరాల్లో వాయుకాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఎక్కువే. ఇది కూడా మన ఆరోగ్యాలమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలే కాకుండా ఆందోళన, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు వస్తాయి. మితిమీరిన శబ్దాలను దీర్ఘకాలం పాటు వింటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో నాలుగేళ్లపాటు శబ్దకాలుష్యమున్న నగరాల్లో నిర్వహించిన ఒక సర్వేని బట్టి, ముంబయి ధ్వని కాలుష్యం విషయంలో మొదటిస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ రెండు మూడు స్థానాల్లో, […]
నగరాల్లో వాయుకాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం కూడా ఎక్కువే. ఇది కూడా మన ఆరోగ్యాలమీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. శబ్ద కాలుష్యంతో వినికిడి లోపాలే కాకుండా ఆందోళన, హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు వస్తాయి. మితిమీరిన శబ్దాలను దీర్ఘకాలం పాటు వింటే గుండె వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో నాలుగేళ్లపాటు శబ్దకాలుష్యమున్న నగరాల్లో నిర్వహించిన ఒక సర్వేని బట్టి, ముంబయి ధ్వని కాలుష్యం విషయంలో మొదటిస్థానంలో ఉంది. లక్నో, హైదరాబాద్ రెండు మూడు స్థానాల్లో, ఢిల్లీ చెన్నై నాలుగు అయిదు స్థానాల్లో ఉన్నాయి. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా లాంటి నగరాల్లో ఉంటున్నవారిలో 20 డెసిబెల్స్ మేరకు వినికిడి శక్తి లోపిస్తున్నదని, మనం దీన్ని పట్టించుకోవటం లేదని ఇఎన్‌టి వైద్యనిపుణులు అంటున్నారు. గ్రామాలనుండి వచ్చినవారికి ఈపాటి వినికిడి లోపం ఉంటే దాన్ని సమస్యగా భావిస్తామని, కానీ నగరాల్లో జనం ఇందుకు అలవాటు పడిపోతున్నారని వారు చెబుతున్నారు.
దీర్ఘకాలం పాటు 67 నుండి 70 డెసిబెల్స్ వరకు శబ్దకాలుష్యాన్ని భరిస్తున్నవారిలో హైపర్ టెన్షన్‌కి గురయ్యే ప్రమాదం హెచ్చుగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అలాగే రాత్రులు నిద్రించే సమయంలో 50 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని దీర్ఘకాలం పాటు వింటూ ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఇవి కాకుండా అధిక శబ్దాలు తలనొప్పులు, అలసట, విసుగు, పొట్టలో అల్సర్లు లాంటి బాధలను సైతం తెచ్చిపెడతాయి.