కేబుల్ ఆపరేటర్లకు సాక్షి "బెదిరింపులు"
చంద్రబాబు తన అధికారబలాన్ని ఉపయోగించి ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలు రాకుండా నిలిపివేయించగలిగారు. ప్రభుత్వ ఒత్తిడికి ఎంఎస్‌వోలు కూడా మరోదారి లేక లొంగిపోయారు. కొద్ది రోజులక్రితం ఎన్టీవీని కూడా ఇదే తరహాలో లోకేష్ కనుసన్నల్లో అడ్డుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఛానల్ దారికి రావడంతో ప్రసారాలకు బాబు అండ్ సన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీవీని బంద్ చేసినప్పుడు జనం నుంచి కేబుల్ ఆపరేటర్లపై పెద్దగా ఒత్తిడి రాలేదు. కానీ ఇప్పుడు సాక్షి ప్రసారాలను నిలిపివేయడంతో […]
చంద్రబాబు తన అధికారబలాన్ని ఉపయోగించి ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలు రాకుండా నిలిపివేయించగలిగారు. ప్రభుత్వ ఒత్తిడికి ఎంఎస్‌వోలు కూడా మరోదారి లేక లొంగిపోయారు. కొద్ది రోజులక్రితం ఎన్టీవీని కూడా ఇదే తరహాలో లోకేష్ కనుసన్నల్లో అడ్డుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ఛానల్ దారికి రావడంతో ప్రసారాలకు బాబు అండ్ సన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్టీవీని బంద్ చేసినప్పుడు జనం నుంచి కేబుల్ ఆపరేటర్లపై పెద్దగా ఒత్తిడి రాలేదు. కానీ ఇప్పుడు సాక్షి ప్రసారాలను నిలిపివేయడంతో కేబుల్ ఆపరేటర్లపై కస్టమర్ల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తోంది.
స్టేట్‌లో భారీగా వైఎస్‌ఆర్ అభిమానులు ఉండడం, వారంతా సాక్షిని తమ సొంత ఛానల్‌గా భావించే పరిస్థితి ఉండడంతో ఆపరేటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా చోట్ల ”సాక్షిని ఇస్తారా లేకుంటే గోళం (డీటీహెచ్ ) పెట్టుకోమంటారా” అన్న బెదిరింపు కామనైపోయిందని కేబుల్ ఆపరేటర్లు వాపోతున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్టు ముద్రగడ దీక్ష వరకు అయితే ఏదోవిధంగా నెట్టుకురావచ్చని… ఒకవేళ ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఇలాగే ప్రసారాలను అడ్డుకుంటే వ్యాపార పరంగా తమకు తీవ్ర నష్టం తప్పదని కేబుల్ ఆపరేటర్లంతా వాపోతున్నారు. నాణేనికి రెండో వైపు తెలియాలంటే సాక్షి కూడా ఉండాలన్నది చాలా మంది కస్టమర్ల భావనగా ఉందంటున్నారు. ఒకవేళ సాక్షి ప్రసారాలను పునరుద్దరించకుంటే వైసీపీ, సాక్షి అభిమానులు గ్యారెంటీగా డీటీహెచ్ వైపు మొగ్గుచూపే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. డీటీహెచ్ కనెక్షన్ తీసుకోవడం కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో అటువైపు ఈజీగా మళ్లే అవకాశం ఉందంటున్నారు.
అదే జరిగితే తక్కువలో తక్కువగా ఒక 30 శాతం వ్యాపారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని, అప్పుడు కోట్లలో నష్టం తప్పదని లెక్కలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో సామూహికంగా డీటీహెచ్‌ల కొనుగోలు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు ఎంఎస్‌ఓలకు ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఎంఎస్‌ఓలు కక్ష కట్టి సాక్షి ప్రసారాలను అడ్డుకుంటున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద ఎన్టీవీ మీద చేసిన ప్రయోగం సాక్షి విషయంలో సక్సెస్ అయ్యే సూచనలు కనిపించడం లేదంటున్నారు. పైగా రేపు అధికారం మారితే టీడీపీ అనుకూల ఛానళ్లకు కూడా ఇదే తరహా ట్రీట్‌మెంట్ తప్పదేమోనని భావిస్తున్నారు. అయితే సాక్షిపై ప్రభుత్వ నిషేధం ఎక్కువరోజులు సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
Click on Image to Read: