పురందేశ్వరితో స్నేహం చేస్తే అంతే!
పురందేశ్వరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నిరోజులు అక్కడే ఉండి, కేంద్రమంత్రిగా పదవి అనుభవించి తీరా ఆ పార్టీ దారుణంగా ఓడిపోగానే వెంకయ్యనాయుడు సాయంతో బీజేపీలోకి దూకేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీకి పురందేశ్వరి ఒక పెద్ద దిక్కు అన్న భావన కలిగించేందుకు ఒక నెట్‌వర్క్ తెర వెనుక బాగా పనిచేస్తోందని చెబుతుంటారు. వెంకయ్యనాయుడు లాంటి వారి వద్ద తనకున్న పలుకుబడితో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారామె. ఏపీకి బీజేపీ నేతలు ఎవరైనా వస్తే వారికి ట్రాన్స్‌లేటర్‌గానూ పురందేశ్వరి ఉంటున్నారు. ఆమెను […]
పురందేశ్వరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నిరోజులు అక్కడే ఉండి, కేంద్రమంత్రిగా పదవి అనుభవించి తీరా ఆ పార్టీ దారుణంగా ఓడిపోగానే వెంకయ్యనాయుడు సాయంతో బీజేపీలోకి దూకేశారు. ఇప్పుడు ఏపీ బీజేపీకి పురందేశ్వరి ఒక పెద్ద దిక్కు అన్న భావన కలిగించేందుకు ఒక నెట్‌వర్క్ తెర వెనుక బాగా పనిచేస్తోందని చెబుతుంటారు. వెంకయ్యనాయుడు లాంటి వారి వద్ద తనకున్న పలుకుబడితో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారామె. ఏపీకి బీజేపీ నేతలు ఎవరైనా వస్తే వారికి ట్రాన్స్‌లేటర్‌గానూ పురందేశ్వరి ఉంటున్నారు. ఆమెను ఏపీ బీజేపీకే పెద్దదిక్కుగా మార్చాలని ప్రయత్నిస్తున్న నెట్‌వర్క్ … ఆమె దగ్గర సమస్యలు చెప్పుకుంటే ఆటోమెటిక్‌గా పరిష్కారం అయిపోతాయని నమ్మిస్తోందని చెబుతున్నారు.
ఆ మాటలు వినే ఏపీ సచివాలయ ఉద్యోగులు పురందేశ్వరిని కలిశారని చెబుతున్నారు. అయితే పురందేశ్వరిని కలవడం వల్ల సమస్య పరిష్కారం సంగతి అలా ఉంచితే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఉద్యోగుల పరిస్థితి తయారైంది. తొలి నుంచి కూడా పురందేశ్వరి పేరు వింటే చిటపటలాడే చంద్రబాబు … ఆమెను కలిసిన ఉద్యోగులపై కక్ష కట్టినట్టు వ్యవహరించారు. జూన్ 27కు మీరంతా అమరావతిలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పారు. మరోసారి ఆలోచించండి అని విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం నేతను… ”మొండిగా వ్యవహరిస్తే సస్పెండ్ చేసి ఇంటికి పంపిస్తా.. అమరావతి రావాల్సిందిగా కోరితే వెళ్లి రాజకీయపార్టీల నేతలను కలుస్తారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంచేస్తామంటారా” అని రగిలిపోయారు. చంద్రబాబు ఇలా వ్యవహరించడానికి కారణం పురందేశ్వరిని ఉద్యోగ సంఘాల నేతలు కలవడమేనంటున్నారు.
ఉద్యోగులు ఆమెను కలిసిన తర్వాతే చంద్రబాబులో పట్టింపు మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ విషయంలోనే కాదు మరేవిషయంలోనైనా పురందేశ్వరిని కలిసిన వారిని చంద్రబాబు తన శత్రువుగానే పరిగణిస్తారని చెబుతున్నారు. టీడీపీ నేతలు కొందరు ఎన్టీఆర్ కూతురు అని కూడా చూడకుండా పురందేశ్వరిని ఇష్టమొచ్చినట్టు తిట్టడానికి కారణం కూడా ఇదేనంటున్నారు. చంద్రబాబు మనసు తెలుసు కాబట్టే వారు ఇలా పురందేశ్వరిపై విరుచుకుపడుతుంటారట. సో… ఏపీ ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలనుకున్న వారు, చంద్రబాబుకు శత్రువు కాకూడదనుకున్న వారు … పురందేశ్వరికి మాత్రం దూరంగా ఉండాల్సిందేనంటున్నారు టీడీపీ నేతలు.
రాజకీయ విశ్లేషకులు మాత్రం చంద్రబాబు ప్రవర్తనకు ఆశ్చర్యపోవడం లేదు. ఇద్దరూ ఇద్దరే అంటున్నారు. ఎన్టీరామారావు కూతురు అన్న ఏకైక కారణంతో ఆమెను కాంగ్రెస్ పార్టీ పెద్దలు వంటింట్లోనుంచి తీసుకెళ్లి నేరుగా కేంద్ర మంత్రి పీఠంమీద కూర్చోబెట్టారు. అధికారంలో వున్న పదేళ్లలో ఆమె కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉపయోగపడిందో తెలియదుగానీ ఒక సామాజిక వర్గ ప్రయోజనాల శాఖకు మంత్రిగా పనిచేసినట్లు అనిపించింది అని ఆమె వ్యతిరేకులు కామెంట్స్ చేసేవారు. చంద్రబాబు కూడా వెంకయ్యనాయుడు ద్వారా ఈమెతో తనకు కావాల్సిన పనులు చేయించుకునేవాడు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అదో పెద్ద గందరగోళ దివాణం. మితిమీరిన స్వేచ్చ, ఎవరు ఎందుకు పనిచేస్తున్నారో, ఏ ప్రయోజనాలకు పనిచేస్తున్నారో, ఏ పార్టీకోసం పనిచేస్తున్నారో తెలుసుకోలేనంత గందరగోళ ప్రభుత్వం కాంగ్రెస్ ది. అందువల్లే ఆమె అనుకున్నది చేసుకోగలిగింది.
ఇక కాంగ్రెస్ పని అయిపోయింది అనుకోగానే తనకు రాజకీయ జన్మనిచ్చి అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టిన కాంగ్రెస్ ను కరివేపాకులా పక్కనపడేసి బీజేపీ పంచన చేరింది. ఆమె పదవీ కాంక్ష, అలివిమాలిన స్వార్ధం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే ఆమెకు గెలిచే ఎంపీ సీటు ఇవ్వకుండా ఓడిపోయే సీటును కేటాయించి ఆమెను ఎక్కడ వుంచాలో అక్కడ వుంచాడు. ఇప్పడు ఆమె మళ్లీ బీజేపీ నాయకురాలిగా ఆంధ్రప్రదేశ్ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చంద్రబాబు చేస్తున్నాడు. అందుకే ఆమెను కలిసిన ఏపీ ఉద్యోగులపై ఆయనకు అంత కోపం వచ్చింది. ఉద్యోగులకు పనిచేసుకోవడం తెలుసుగానీ పాపం ఈ లోగుట్టు రాజకీయాలు తెలియక దెబ్బతిన్నారు.
Click on Image to Read: