నేను ముందే చెప్పా... అతడో పెద్ద జోకర్
పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేతనారాయణ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక పెద్ద జోకర్ అని తాను ముందేచెప్పానన్నారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే, ప్రభుత్వం అతడిపై దాడి చేస్తుంటే కాపుల కోసం నిలబడాల్సిన పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. సమయానుకూలంగా హీరోలా రావడం … పరిస్థితి బాగోలేనప్పుడు జీరోలా మాయమైపోవడం పవన్‌కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు. పవన్ అప్పుడప్పుడు వచ్చి జిమ్మిక్కులు చేసి వెళ్తున్నారని […]

పవన్ కల్యాణ్‌పై సీపీఐ నేతనారాయణ మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఒక పెద్ద జోకర్ అని తాను ముందేచెప్పానన్నారు. ముద్రగడ దీక్ష చేస్తుంటే, ప్రభుత్వం అతడిపై దాడి చేస్తుంటే కాపుల కోసం నిలబడాల్సిన పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. సమయానుకూలంగా హీరోలా రావడం … పరిస్థితి బాగోలేనప్పుడు జీరోలా మాయమైపోవడం పవన్‌కల్యాణ్‌కు అలవాటుగా మారిందన్నారు.
పవన్ అప్పుడప్పుడు వచ్చి జిమ్మిక్కులు చేసి వెళ్తున్నారని విమర్శించారు. ఇలాంటి క్లిష్టసమయంలో మాట్లాడకుండా భవిష్యత్తులో వచ్చి నీతులు చెబుతానంటే వినేందుకు ఎవరూ సిద్ధంగా ఉండరన్న విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవాలన్నారు. పవన్ బయటకు వచ్చి మాట్లాడాలని… ఎవరి పక్షం నిలబడుతారన్నది ఆయన ఇష్టమని నారాయణ అన్నారు… తెలంగాణ విషయాలు మాట్లాడుతూ కోదండరాంను విమర్శించడం అంటే కేసీఆర్ తన పతనానికి తానే నాందిపలకడం అని నారాయణ అభిప్రాయపడ్డారు.
Click on Image to Read: