కుటుంబ నియంత్రణకు నో… అబ్బాయి పుట్టే వరకు ఆగుతాం!
ఆడపిల్లలు ఎంతగా ముందుకు వెళుతున్నా, మగపిల్లల పట్ల ఉన్న మోజు మాత్రం చాలామంది తల్లిదండ్రుల్లో తగ్గటం లేదు. గ్రామాల్లోనే కాదు, నగరాల్లో నివసించే మహిళల్లో సగం మంది… ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ముందుకు రావటం లేదని, వారు మగపిల్లాడికోసం ఎదురుచూడాలనే అనుకుంటున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తమిళనాడులోని శ్రీ రామచంద్ర మెడికల్ యూనివర్శిటీ ఈ అంశంపై ఒక సర్వేని కొనసాగిస్తోంది. జనాభా నియంత్రణ, ప్రసవ మరణాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు […]
ఆడపిల్లలు ఎంతగా ముందుకు వెళుతున్నా, మగపిల్లల పట్ల ఉన్న మోజు మాత్రం చాలామంది తల్లిదండ్రుల్లో తగ్గటం లేదు. గ్రామాల్లోనే కాదు, నగరాల్లో నివసించే మహిళల్లో సగం మంది… ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కి ముందుకు రావటం లేదని, వారు మగపిల్లాడికోసం ఎదురుచూడాలనే అనుకుంటున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తమిళనాడులోని శ్రీ రామచంద్ర మెడికల్ యూనివర్శిటీ ఈ అంశంపై ఒక సర్వేని కొనసాగిస్తోంది.
జనాభా నియంత్రణ, ప్రసవ మరణాలను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పలు కుటుంబ నియంత్రణ పద్ధతులను, మహిళలకు ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నా ఇంకా మహిళల్లో పూర్తి స్థాయి స్పందన రాలేదని ఈ యూనివర్శిటీకి చెందిన వైద్యులు అంటున్నారు. గంటల కొద్దీ కౌన్సెలింగ్ చేసినా, కుటుంబ నియంత్రణకు మహిళలు అంగీకరించడం లేదని, తమ కుటుంబం అందుకు ఒప్పుకోదని వారు చెబుతున్నారని గైనకాలజీ డాక్టరు ఒకరు చెప్పారు. ఆపరేషన్ థియేటర్లలో కంటే కౌన్సెలింగ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నా ఫలితం ఉండటం లేదని ఆమె వాపోయారు.
గత రెండేళ్లలో ఈ మెడికల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలుండి డెలీవరీ కోసం వచ్చిన 1,098 మంది మహిళలకు వారి ఆరోగ్యరీత్యా ఇక పిల్లలను కనడం మంచిది కాదని చెప్పినా, ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించినా 500 మంది మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడానికి ముందుకు వచ్చారు. మిగిలిన వారు పలురకాల కారణాలతో ఆపరేషన్‌ని వాయిదా వేశారు. ముఖ్యంగా మగపిల్లలకోసం ఎదురుచూడటం ఇందులో ముఖ్యకారణంగా ఉంది. ఇప్పటికీ తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబంలోని వారి ఒత్తిడికి తలొగ్గి మహిళలు మగపిల్లలకోసం ఎదురుచూస్తున్నారని వైద్యులు అంటున్నారు. కుటుంబ నియంత్రణకోసం ఎన్నో తాత్కాలిక పద్ధతులు అందుబాటులో ఉన్నా మహిళలు వాటిని పాటించడానికి సిద్ధంగా లేరని తమ అధ్యయనంలో తేలినట్టుగా శ్రీ రామచంద్ర మెడికల్ యూనివర్శిటీ వైద్యనిపుణులు తెలిపారు.