చంద్రబాబుకు రాజకీయ పరిణితి లేదు, నియంతృత్వానికి పరాకాష్ట
కాపుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మండిపడ్డారు. కాపులపై కక్షకట్టినట్టు వ్యవహరించడం చంద్రబాబుకు తగదన్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఒక ఘాటైన లేఖను చంద్రబాబుకు చిరంజీవి రాశారు. గోదావరి జిల్లాల వారు మంచివారు, ట్రైన్ తగలబెట్టింది వారు కాదంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అవే జిల్లాలకు చెందిన కాపులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. కాపుల మధ్య చిచ్చు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉందన్నారు. […]

కాపుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి మండిపడ్డారు. కాపులపై కక్షకట్టినట్టు వ్యవహరించడం చంద్రబాబుకు తగదన్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ఒక ఘాటైన లేఖను చంద్రబాబుకు చిరంజీవి రాశారు. గోదావరి జిల్లాల వారు మంచివారు, ట్రైన్ తగలబెట్టింది వారు కాదంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అవే జిల్లాలకు చెందిన కాపులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
కాపుల మధ్య చిచ్చు పెట్టేలా ప్రభుత్వ తీరు ఉందన్నారు. రైలు తగలబెట్టిన వారిపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరని కానీ… అసలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. సున్నితమైన సామాజిక సమస్య పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి చంద్రబాబు ప్రదర్శించలేకపోతున్నారని చిరు అభిప్రాయపడ్డారు. కక్షకట్టినట్టు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. ముద్రగడ దీక్షకు రాజకీయాలు ఆపాదిస్తూ సమస్యను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముద్రగడ వార్తలను ప్రసారంచేయకుండా కొన్ని ఛానళ్లను నిలిచివేయడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని చిరంజీవి అన్నారు.
Click on Image to Read: