తెల్ల అన్నం తెలియని తెలంగాణలో వారికి అన్నం పెట్టింది ఎన్టీఆర్ " బాలయ్య
అమెరికాలో నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ హాజరై కేక్ కట్ చేశారు. ఈసందర్బంగా మాట్లాడిన బాలకృష్ణ… ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి అని అన్నారు. అన్నమయ్య, శంకరాచార్యులు, గాంధీ, ఎన్టీఆర్ మాత్రమే దైవాంశ సంభూతులని చెప్పారు. పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదని… అయితే చివరి వరకు మడమ తిప్పుకుండా పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. తన సినిమాలు చూసి చిన్నపిల్లలు కూడా తొడకొట్టడం, మీసాలు మెలేయడం చేస్తుంటే గర్వంగా ఉంటుందన్నారు. […]
అమెరికాలో నటుడు బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలకృష్ణ హాజరై కేక్ కట్ చేశారు. ఈసందర్బంగా మాట్లాడిన బాలకృష్ణ… ఎన్టీఆర్ తెలుగు జాతి ఆస్తి అని అన్నారు. అన్నమయ్య, శంకరాచార్యులు, గాంధీ, ఎన్టీఆర్ మాత్రమే దైవాంశ సంభూతులని చెప్పారు. పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదని… అయితే చివరి వరకు మడమ తిప్పుకుండా పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.
తన సినిమాలు చూసి చిన్నపిల్లలు కూడా తొడకొట్టడం, మీసాలు మెలేయడం చేస్తుంటే గర్వంగా ఉంటుందన్నారు. ఆహారభద్రతను 1983లోనే ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ”తెలంగాణ అయితేనేం … అసలు తెల్లఅన్నమంటే తెలియని అక్కడి వారికి అయితేనేం… నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేలా చేసింది ఎన్టీఆర్” అని బాలయ్య చెప్పారు. సొంతభాష మాట్లాడితే తల్లిపాలు తాగినట్టు అని పరాయిభాష మాట్లాడితే డబ్బా పాలు తాగినట్టేనని అమెరికాలో బాలయ్య చెప్పారు. ఇక్కడ మరోవిషయం ఏమింటంటే గతంలోనూ చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. గొడ్డుకారం తినే రాయలసీమ వారికి తెల్లన్నం పరిచయం చేసింది ఎన్టీఆరేనని గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలకృష్ణ వంతు అయింది.
Click on Image to Read: