అమిత్... ఈ ప్రశ్నలకు సమాధానాలేవి?
వికాస్ పర్వ్ సభ సందర్భంగా తెలంగాణలో తమ ఉనికిని చాటే ప్రయత్నం చేసింది బీజేపీ. తెలంగాణ అభివృద్ధి మొత్తం తమ చలవేనని, తాము తెలంగాణకు రూ.90 వేల కోట్ల నిధులు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకున్నారు అమిత్‌షా. అమిత్ ప్రసంగంలో తెలంగాణకు అది చేశాం.. ఇది చేశాం అని చెప్పారే తప్ప.. ఏం చేశారో స్పష్టంగా చెప్పలేకపోయారు. అమిత్ ప్రసంగం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ.. తెలంగాణవాదులు – గులాబీనేతలు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు. అమిత్ షా తెలంగాణకు […]
BY sarvi11 Jun 2016 4:48 AM IST
X
sarvi Updated On: 11 Jun 2016 5:34 AM IST
వికాస్ పర్వ్ సభ సందర్భంగా తెలంగాణలో తమ ఉనికిని చాటే ప్రయత్నం చేసింది బీజేపీ. తెలంగాణ అభివృద్ధి మొత్తం తమ చలవేనని, తాము తెలంగాణకు రూ.90 వేల కోట్ల నిధులు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకున్నారు అమిత్‌షా. అమిత్ ప్రసంగంలో తెలంగాణకు అది చేశాం.. ఇది చేశాం అని చెప్పారే తప్ప.. ఏం చేశారో స్పష్టంగా చెప్పలేకపోయారు. అమిత్ ప్రసంగం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపినప్పటికీ.. తెలంగాణవాదులు – గులాబీనేతలు మాత్రం ఆయనపై మండిపడుతున్నారు. అమిత్ షా తెలంగాణకు వచ్చి పాలన వ్యవహారంలో నీతులు చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలుకుతున్నారు. ముందు అవినీతి మరకలు అంటించుకున్న తెలుగుదేశం అండ లేకుండా గెలవగలరా? అని సవాలు విసురుతున్నారు.
ఈ ప్రశ్నలకు బీజేపీ నేతలు బదులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అవేంటంటే..?
1. తెలంగాణలో హైకోర్టు విభజనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
2. ఏపీ తెలంగాణకు కరెంటు ఇవ్వనన్నందుకు ఎందుకు మౌనంగా ఉన్నారు?
3. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేదు?
4. ఓటుకు నోటు కేసు బయటపడ్డా.. ఇంకా ఎందుకు తెలుగుదేశంతో సంబంధాలు కొనసాగిస్తున్నారు?
5. దేశ విదేశాల్లో తిరుగుతున్న మోదీకి తెలంగాణ ఎక్కడుందో తెలుసా?
6. అవినీతి లేదని బుకాయిస్తోన్న సర్కారు.. లలిత్ మోదీ, విజయ్ మాల్యాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల మాటేంటి?
7. తెలంగాణ సంక్షేమ పథకాలను నీతి అయోగ్, ప్రధాని మోదీ ప్రశంసిస్తోంటే..మీరెందుకు విమర్శిస్తున్నారు?
8. మిత్రపక్షం టీడీపీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. వారి నుంచి రాజ్యసభ సీటు ఎలా తీసుకున్నారు?
9. అశోక్ గజపతిరాజు ఓఎస్ డీ అప్పారావు వ్యవహారంలో మీరు తీసుకున్న చర్యలేంటి?
10. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నానికి ఎందుకు మద్దతిచ్చారు?
Next Story