ఉత్తరాఖండ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు!
ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో అధికార పార్టీలు దగ్గరుండి జరుపుతోన్న ఫిరాయింపులకు ఇది చెంప పెట్టు వంటిదని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ సాక్షాత్తూ ముఖ్యమంత్రులే దగ్గరుండి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం విశేషం. ఉత్తరాఖండ్ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వల్ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని […]
BY sarvi9 Jun 2016 9:00 PM GMT
X
sarvi Updated On: 10 Jun 2016 12:19 AM GMT
ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ర్టాల్లో అధికార పార్టీలు దగ్గరుండి జరుపుతోన్న ఫిరాయింపులకు ఇది చెంప పెట్టు వంటిదని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ సాక్షాత్తూ ముఖ్యమంత్రులే దగ్గరుండి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం విశేషం. ఉత్తరాఖండ్ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వల్ తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్ని రాష్ర్టాల నుంచి కుంజ్వల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కుంజ్వల్ తీసుకున్న గొప్ప విషయమేంటంటే… అధికార పార్టీకి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేపైనా అనర్హత వేటు వేయడం. అందుకే, దేశవ్యాప్తంగాఉన్న ప్రతిపక్షాలు ఈ విషయంలో కుంజ్వల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి.
అసలేం జరిగింది?
ఉత్తరాఖండ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటీవల అధికార పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలే తిరుగుబాటు లేవదీశారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అక్కడున్న చిన్నపార్టీ పీడీఎఫ్, స్వతంత్రులు తమవైపు తిరుగుతారని బీజేపీ భావించింది. రావత్‌ను గద్దె దింపి అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్రపతి పాలనను ఉన్నత న్యాయస్థానం తప్పబట్టింది. వెంటనే విశ్వాస పరీక్షకు ఆదేశించింది. ఆ పరీక్షలో చిన్నపార్టీ పీడీఎఫ్, స్వతంత్రులు కాంగ్రెస్‌కే ఓటు వేశారు. దీంతో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఇదే క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో వీరిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం.. నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పీకర్ వివరించారు. ఈ నిర్ణయంతో వివిధ రాష్ర్టాల్లో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, అధికార పార్టీల్లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Next Story