బాలయ్య బర్త్ డే గిఫ్ట్..!
నందమూరి బాలకృష్ణ చేస్తున్న 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్నకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే మొరాకోలో కొంత పార్ట్ షూట్ చేసి ..ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చేస్తున్నారు. అయితే జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో చిత్రయూనిట్ అందరి పేర్లకు ‘పుత్ర’ జోడించారు. బాలకృష్ణను ‘బసవరామతారకపుత్ర’గా […]
![బాలయ్య బర్త్ డే గిఫ్ట్..! బాలయ్య బర్త్ డే గిఫ్ట్..!](http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/balakrishna.gif)
నందమూరి బాలకృష్ణ చేస్తున్న 100వ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి పై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్నకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యనే మొరాకోలో కొంత పార్ట్ షూట్ చేసి ..ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చేస్తున్నారు. అయితే జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో చిత్రయూనిట్ అందరి పేర్లకు ‘పుత్ర’ జోడించారు. బాలకృష్ణను ‘బసవరామతారకపుత్ర’గా వర్ణించారు. దర్శకుడి పేరును అంజనా పుత్ర క్రిష్, నిర్మాతల పేర్లను కమలాపుత్ర రాజీవ్ రెడ్డి, సీతారామపుత్ర సాయిబాబా అని వేశారు. టెక్నీషియన్ల పేర్లకు కూడా ‘పుత్ర’ తగిలించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తుంది. గతంలో చెన్న కెశవ రెడ్డి చిత్రంలో బాలకృష్ణ సరసన నటించింది. మొత్తం మీద నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఈ పోస్టర్ గిప్ట్ గా ఇచ్చాడన్నమాట.
Click on Image to Read: