బాబు నిర్ణయంతో యనమల వెన్నులో వణుకు
అమరావతి నిర్మాణాన్ని తనకు ఇష్టమైన విదేశీ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇందుకు స్వీస్ చాలెంజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానంలో విధివిధానాలు, సలహాలు, సూచనలు చేసేందుకు పేరుకు ఒక కమిటీని చంద్రబాబు నియమించారు. ఇందుకు మంత్రి యనమలను కమిటీ చైర్మన్‌గా నియమించారు. మంత్రినారాయణ, అధికారులు అజయ్ జైన్, పీవీ రమేష్, లక్ష్మిపార్థసారధి తదితరులను సభ్యులుగా నియమించారు. 15 రోజుల్లోగా సలహాలు, సూచనలతో స్వీస్ చాలెంజ్‌పై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ సమావేశం […]
అమరావతి నిర్మాణాన్ని తనకు ఇష్టమైన విదేశీ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఇందుకు స్వీస్ చాలెంజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విధానంలో విధివిధానాలు, సలహాలు, సూచనలు చేసేందుకు పేరుకు ఒక కమిటీని చంద్రబాబు నియమించారు. ఇందుకు మంత్రి యనమలను కమిటీ చైర్మన్‌గా నియమించారు. మంత్రినారాయణ, అధికారులు అజయ్ జైన్, పీవీ రమేష్, లక్ష్మిపార్థసారధి తదితరులను సభ్యులుగా నియమించారు. 15 రోజుల్లోగా సలహాలు, సూచనలతో స్వీస్ చాలెంజ్‌పై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. కానీ సమావేశం నిర్వహించకుండా కమిటీ సభ్యులు తప్పించుకుని తిరిగారు. చివరకు చంద్రబాబు ఒత్తిడితో గురువారం కమిటీసమావేశం అయింది. అయితే స్వీస్ చాలెంజ్ విధానం దెబ్బకు కమిటీ సభ్యులు భయపడుతున్నారు.
భవిష్యత్తులో స్వీస్ చాలెంజ్ విధానం ఒక భారీ కుంభకోణానికి మూలం కాబోతోందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు తమకు ఇష్టమైన కంపెనీలకు నిర్మాణ బాధ్యత కట్టబెట్టేందుకు కుట్రపూరితంగానే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ ప్రక్రియలో పాల్గొన్న వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందేనని అందుకే నిర్ణయాలు తీసుకునేందుకు కమిటీ జంకుతోందని చెబుతున్నారు. కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నయనమల … భవిష్యత్తును గ్రహించి ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ముడుపులుతీసుకునే వారు ఒకరు, కేసుల్లో ఇరుక్కునేవారు మరొకరు అన్నట్టుగా పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. స్వీస్ చాలెంజ్ విధానంపై సూచనలు చేసేందుకు సీఎస్ ఠక్కర్ కూడా ముందుకు రావడంలేదని చెబుతున్నారు.. ఫైల్ ఆఖర్లో ఎలాగూ తన వద్దకు వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుని తప్పించుకుంటున్నారు. ఇప్పటికే స్వీస్ చాలెంజ్ విధానంపై అజయ్ జైన్, పీవీ రమేష్ లాంటి వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న యనమల ఏ మాత్రం ఇష్టలేకున్నా నామమాత్రంగా కమిటీ వ్యవహారాల్లో పనిచేస్తున్నారు. స్వీస్ చాలెంజ్‌లో పాలుపంచుకున్న మంత్రులు, అధికారులకు భవిష్యత్తులోఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని సీనియర్ అధికారులు భావిస్తున్నారు.
Click on Image to Read: