విద్యార్థులు ఫీజులకోసం...ఆ పని… చేస్తున్నారు!
యూనివర్శిటీ విద్యార్థుల్లో ప్రతి ఇరవై మందిలో ఒకరు తమ ట్యూషన్ ఫీజుల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు….ఇంగ్లండులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఛెల్‌టెన్హమ్ సైన్స్ ఫెస్టివల్‌లో ట్రసీ సాగర్, డెబ్బీ జోన్స్ అనే ఇద్దరు మహిళా పరిశోధకులు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7 నుండి 12 వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా గొప్ప సైంటిస్టులు పాల్గొంటున్నారు. అలాంటి ఉత్సవంలో ఆ ఇద్దరు పరిశోధకులు, ఈ విషయంమీద తాము అతిపెద్ద అధ్యయనాన్ని నిర్వహించామని, ఇందులో […]
యూనివర్శిటీ విద్యార్థుల్లో ప్రతి ఇరవై మందిలో ఒకరు తమ ట్యూషన్ ఫీజుల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు….ఇంగ్లండులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఛెల్‌టెన్హమ్ సైన్స్ ఫెస్టివల్‌లో ట్రసీ సాగర్, డెబ్బీ జోన్స్ అనే ఇద్దరు మహిళా పరిశోధకులు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7 నుండి 12 వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రపంచవ్యాప్తంగా గొప్ప సైంటిస్టులు పాల్గొంటున్నారు. అలాంటి ఉత్సవంలో ఆ ఇద్దరు పరిశోధకులు, ఈ విషయంమీద తాము అతిపెద్ద అధ్యయనాన్ని నిర్వహించామని, ఇందులో ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు ఏదోఒక రూపంలో సెక్స్ పరిశ్రమలో ఉన్నట్టుగా గుర్తించామని చెప్పారు. విద్యార్థులు బతుకు తెరువుకోసం, ట్యూషన్ ఫీజులకోసం ఈ పనిచేస్తున్నారని వీరు తెలిపారు.
స్వాన్సీ యూనివర్శిటీలో క్రిమినాలజీ డిపార్ట్‌మెంట్ కి చెందిన ప్రొఫెసర్ సాగర్…మరో అడుగు ముందుకేసి, తమ ఆరోగ్యానికి, శరీరానికి ఎలాంటి హానీ లేనపుడు అలా చేయటంలో తప్పులేదని కూడా చెప్పారు. బారుల్లో పనిచేయడానికి, దీనికి పెద్ద తేడా లేదన్న ఆమె మాటలు అక్కడ సంచలనాన్నే సృష్టించాయి. మూడేళ్ల పాటు 6,773 మంది యూనివర్శిటీ స్టూడెంట్స్‌ని సర్వే చేసి తాము ఈ నిర్దారణకు వచ్చినట్టుగా వారు తెలిపారు.
అమ్మాయిలతో పాటు అబ్బాయిలు సైతం ఈ పనిచేస్తున్నారని, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు చేసుకునే హెన్ పార్టీల్లో నగ్నత్వాన్ని ప్రదర్శించే అబ్బాయిలకు సైతం మంచి డిమాండ్ ఉందని వీరు తెలిపారు. ఈ పనులు విద్యార్థులకు ఎలాంటి హానీ చేయవని, అయితే వారు ఎలాంటి మోసాలకు గురికాకుండా, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే తమ చదువుకి ఏ ఆటంకం కలగకుండా చూసుకోవడం ముఖ్యమని సాగర్ అన్నారు.
యూనివర్శిటీలు ఈ విషయాన్ని గుర్తించి, వారికి తగిన సహాయం అందించాలని కోరుకుంటున్నానని సాగర్ తెలిపారు. అయితే ఈమె చేసిన కామెంట్లపై పలు వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. మహిళల వెబ్‌సైట్లు, తల్లిదండ్రుల సంఘాల నుండి పలువురు దీనిపై మండిపడుతున్నారు. బార్‌లో పనిచేయడం, వ్యభిచారం ఒకటే ఎలా అవుతుందని నిలదీస్తున్నారు. ఇవి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు అవుతాయని వారు విమర్శిస్తున్నారు.