చానల్ ప్రసారాలు నిలిపేశారని ప్రకటించిన సాక్షి
ఏపీలోని పలు జిల్లాల్లో సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేశారు.. ప్రభుత్వమే ఈ పని చేయించిందని సాక్షి టీవీ ఆరోపించింది. ఎంఎస్‌వోలపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ పనిచేశారని సాక్షి వెల్లడించింది. అకారణంగా సాక్షి ప్రసారాలు నిలిపివేయడాన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. కొద్దిరోజుల క్రితం ఏపీలో ఈ తరహాలోనే ఎన్‌టీవీ ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది.అప్పట్లో దుమారం రేగింది. అయితే ఆ తర్వాత ఎన్టీవీ వెనక్కు తగ్గడంతో తిరిగి ప్రసారాలుమొదలయ్యాయని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై సాక్షి […]
ఏపీలోని పలు జిల్లాల్లో సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేశారు.. ప్రభుత్వమే ఈ పని చేయించిందని సాక్షి టీవీ ఆరోపించింది. ఎంఎస్‌వోలపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ పనిచేశారని సాక్షి వెల్లడించింది. అకారణంగా సాక్షి ప్రసారాలు నిలిపివేయడాన్ని జర్నలిస్టు సంఘాల నేతలు ఖండించారు. కొద్దిరోజుల క్రితం ఏపీలో ఈ తరహాలోనే ఎన్‌టీవీ ప్రసారాలను టీడీపీ ప్రభుత్వం అడ్డుకుంది.అప్పట్లో దుమారం రేగింది. అయితే ఆ తర్వాత ఎన్టీవీ వెనక్కు తగ్గడంతో తిరిగి ప్రసారాలుమొదలయ్యాయని చెబుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంపై సాక్షి మినహా మిగిలిన ఏ టీవీ చానల్ కూడా దూకుడుగా వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో సాక్షిని ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు. ఇటీవల పదేపదే సాక్షి పత్రిక, టీవీని స్వాధీనం చేసుకుంటామని కూడా చంద్రబాబు, మంత్రి యనమల చెబుతూ వస్తున్నారు. అయితే అది సాధ్యమయ్యే పనికాదన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ఓల ద్వారా సాక్షి ప్రసారాలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టు భావిస్తున్నారు.
Click on Image to Read: