రామసుబ్బారెడ్డి, గంగులకు షాక్ ఇచ్చిన బాబు
వాడుకొని వదిలేసే సిద్ధాంతాన్ని చంద్రబాబు మరోసారి అమలుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు నియోజకవర్గ నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా చంద్రబాబు నిలిపివేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పేరు మీద నిధులు మంజూరు చేశారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరకముందే అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్ రామసుబ్బారెడ్డి పేరుతో నిధులు మంజూరు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమ అఖిల ప్రియ వైసీపీలో ఉండగా ఆమెను కాదని ఆళ్ళగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్రతాప్ రెడ్డి […]
వాడుకొని వదిలేసే సిద్ధాంతాన్ని చంద్రబాబు మరోసారి అమలుచేశారు. వైసీపీ ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు నియోజకవర్గ నిధులను ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా చంద్రబాబు నిలిపివేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పేరు మీద నిధులు మంజూరు చేశారు. ఆదినారాయణరెడ్డి పార్టీలో చేరకముందే అక్కడ టీడీపీ ఇన్‌చార్జ్ రామసుబ్బారెడ్డి పేరుతో నిధులు మంజూరు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమ అఖిల ప్రియ వైసీపీలో ఉండగా ఆమెను కాదని ఆళ్ళగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్రతాప్ రెడ్డి పేరుతో నిధులు మంజూరు చేశారు. అయితే ఇప్పుడు సీన్ మారింది.
రామసుబ్బారెడ్డి, గంగుల పేర్ల మీదకాకుండా ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ పేరు మీదుగానే నిధులు మంజూరు చేస్తున్నారు. దీంతో పాత టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. ఒకప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్ చేసి లొంగదీసుకునేందుకు టీడీపీ ఇన్‌చార్జ్‌లను వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆదినారాయణరెడ్డి, అఖిలప్రియ టీడీపీలోకి రాగానే రామసుబ్బారెడ్డి, గంగులకు హ్యాండిచ్చేశారు. దీంతో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి, ఆర్థికంగా నష్టపోయినా పార్టీని నమ్ముకుని ఉన్న రామసుబ్బారెడ్డి వర్గం ఆవేదన చెందుతోంది. మొన్నటి వరకు టీడీపీ ఇన్‌చార్జ్‌లకు నిధులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హఠాత్తుగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకే నిధులు ఇవ్వడంపై వైసీపీ అధికారప్రతినిధి వేణుగోపాలకృష్ణ స్పందించారు. చంద్రబాబు ద్వంద్వ నీతికి ఇది నిదర్శనం అన్నారు.
అయితే రామసుబ్బారెడ్డి, గంగులను వదిలించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగే సూచనలు కనిపించడంలేదు. కాబట్టి ఒక్కో నియోజకవర్గంలో రెండుమూడు గ్రూపులున్న నేపథ్యంలో కొన్ని గ్రూపులకు బాబు పొగపెట్టే ప్రయత్నం మొదలుపెట్టారా అన్నఅనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Click on Image to Read: