ఇంటి తలుపులు బద్ధలు- ముద్రగడ అరెస్ట్, విలపించిన సతీమణి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాపులపై కేసులు ఎత్తివేయాలంటూ ఉదయం నుంచి స్వగ్రామం కిర్లంపూడిలో ముద్రగడ ఆమరణదీక్షకు దిగారు. ఇంటి తలుపులువేసుకుని భార్యతో కలిసి దీక్షకు దిగారు. పోలీసులు లోనికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు డబ్బాతో హెచ్చరించారు. అయితే సాయంత్రం పోలీసులు ముద్రగడ ఇంటి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. ముద్రగడను ఎత్తుకెళ్లి అంబులెన్స్‌లోకి చేర్చారు. అక్కడి నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలోనే ముద్రగడ పద్మనాభం […]

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాపులపై కేసులు ఎత్తివేయాలంటూ ఉదయం నుంచి స్వగ్రామం కిర్లంపూడిలో ముద్రగడ ఆమరణదీక్షకు దిగారు. ఇంటి తలుపులువేసుకుని భార్యతో కలిసి దీక్షకు దిగారు. పోలీసులు లోనికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగుల మందు డబ్బాతో హెచ్చరించారు. అయితే సాయంత్రం పోలీసులు ముద్రగడ ఇంటి తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లారు. ముద్రగడను ఎత్తుకెళ్లి అంబులెన్స్‌లోకి చేర్చారు. అక్కడి నుంచి రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలోనే ముద్రగడ పద్మనాభం పురుగుల మందు తాగారంటూ కొన్ని టీవీచానళ్లు బ్రేకింగ్ న్యూస్ నడిపాయి. అయితే ముద్రగడ విషం తీసుకున్నారా లేదా అన్న దానిపై అధికారలెవరూ స్పందించలేదు. ముద్రగడను తరలించేసమయంలో ఆయన భార్య కన్నీటిపర్యంతమయ్యారు. అంబులెన్స్ వెంట వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ముద్రగడను బలవంతంగా తరలించే సమయంలో ఆయన అనుచరులు అడ్డుపడ్డారు. వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం వారిని కూడా అరెస్ట్ చేసి కిర్లంపూడి నుంచి తరలించారు.
Click on Image to Read: