వీరికి టైమ్ దొరికితే ఆపగలమా?
కొందరుంటారు.. ఏదో చేద్దామనుకుంటారు.. ఇంకేదో అవడంతో కంగుతింటారు. చేసేది లేక జనాలకు ముఖం చాటేస్తారు. అసలు ఉన్నారో.. లేరో తెలియకుండా ఉంటారు. కనీసం మీడియాకు ముఖం చూపెట్టరు. ప్రతివారికీ టైమ్ వస్తుందన్నట్లు.. ఏదో ఒక రాజకీయ సంచలనం వీరికోసమే వస్తుంది. ఎడారిలో వర్షపు చినుకులా.. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా.. దొరికిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికప్పడు మీడియా ముందు వీర లెక్చర్లు ఇస్తుంటారు. విచిత్రమేంటంటే.. విమర్శలు చేసినవారు.. పడ్డవారు బిజీగా ఉంటే.. సందట్లో […]
కొందరుంటారు.. ఏదో చేద్దామనుకుంటారు.. ఇంకేదో అవడంతో కంగుతింటారు. చేసేది లేక జనాలకు ముఖం చాటేస్తారు. అసలు ఉన్నారో.. లేరో తెలియకుండా ఉంటారు. కనీసం మీడియాకు ముఖం చూపెట్టరు. ప్రతివారికీ టైమ్ వస్తుందన్నట్లు.. ఏదో ఒక రాజకీయ సంచలనం వీరికోసమే వస్తుంది. ఎడారిలో వర్షపు చినుకులా.. ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా.. దొరికిన అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పటికప్పడు మీడియా ముందు వీర లెక్చర్లు ఇస్తుంటారు. విచిత్రమేంటంటే.. విమర్శలు చేసినవారు.. పడ్డవారు బిజీగా ఉంటే.. సందట్లో సడేమియాలో వీరు ఏదో వర్గంలో చేరిపోతారు.. వారి తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేస్తుంటారు. పిలవని పేరంటానికి వచ్చి హడావుడి చేస్తుంటారు..
నాగం ఆగమాగం..
సొంత వేదికలో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నాగం బీజేపీలో ఉన్నానంటారు.. మరి సొంత కుంపటి సంగతేంటంటే.. దేనికదే! అంటారు. కొంతకాలంగా ఈయనకు టైమ్ బాగా లేదు. పెట్టిన పార్టీని బీజేపీలో విలీనం చేసినా ఫలితం లేదు. బీజేపీ ఆధిపత్య పోరులో అలిగి ఇంటికాడే కూర్చున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వచ్చినా.. జనాలు పట్టించుకోలేదు. ఇలాంటి నాగంకు కోదండరామ్ తిరుగుబాటు కలిసి వచ్చింది. వెంటనే కోదండరామ్ కు మద్దతుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మొత్తానికి కోదండరామ్ పుణ్యమాని ఈయనకు ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు చక్కటి అవకాశం దొరికింది.
రేవంత్ రెడ్డి…
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన తరువాత రేవంత్ స్పీడు రెండింతలైంది. విమర్శలు మానేసి.. తిట్లదండకం మొదలు పెట్టారు. అయినా, టీడీపీ మీడియా తప్ప జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఆయన గొంతు చించుకుంటున్నా.. వినేవారు కరవయ్యారు. ఆయన ఏవిషయం ప్రస్తావించినా.. ముందు ఓటుకునోటు సంగతేంటని? ప‌్రశ్నిస్తున్నారు ప్రత్యర్థులు. దీంతో ఏం చేయాలో పాలుపోక సతమవుతున్న రేవంత్ కు కోదండరామ్ రూపంలో మంచి అవకాశం దొరికింది. ఆకలి మీద ఉన్న పులిలా సర్కారు మీదికి దూకుతున్నాడు. ఎప్పట్లాగే తిట్ల దండకంతో ముందుకు వెళుతున్నాడు.