పురుగుల మందుడబ్బా తీసిన ముద్రగడ
ముద్రగడ దీక్షతో కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. తాను అరెస్ట్ అయ్యేందుకు సిద్దమని అయితే సీఐడీ వాళ్లు రావాలని డిమాండ్ చేశారు. తాను తుని కేసులోనే అరెస్ట్ అవుతానని… వేరే కేసుల్లో అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా లేనని ప్రకటించారు. పోలీసులు బలవంతంగా ముద్రగడ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు డబ్బాను తీశారు. లోపలికి వస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని […]
ముద్రగడ దీక్షతో కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులతో ముద్రగడ వాగ్వాదానికి దిగారు. తాను అరెస్ట్ అయ్యేందుకు సిద్దమని అయితే సీఐడీ వాళ్లు రావాలని డిమాండ్ చేశారు. తాను తుని కేసులోనే అరెస్ట్ అవుతానని… వేరే కేసుల్లో అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా లేనని ప్రకటించారు. పోలీసులు బలవంతంగా ముద్రగడ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుగుల మందు డబ్బాను తీశారు.
లోపలికి వస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. దీంతో పోలీసులు కొద్దిగా వెనక్కు తగ్గారు. చర్చలకు తాను సిద్దంగా లేనని చెప్పారు. ముందు కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాపులు ఆందోళన చెందవద్దని చెప్పారు. కిర్లంపూడిలో భారీగా పోలీసులను మోహరించారు. మీడియాపైనా ఆంక్షలు విధించారు. కిర్లంపూడికి డీఐజీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ చేరుకున్నారు. కిర్లంపూడి వైపు ఎవరినీ రానివ్వడం లేదు.
Click on Image to Read: