ముద్రగడ ఆమరణ దీక్ష మొదలు... జైల్లోనే మగ్గేందుకు సిద్ధం
కాపుల అరెస్ట్‌కు నిరసనగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టారు. తన భార్యతో కలిసి ఇంట్లోనే దీక్షచేస్తున్నారు. అరెస్ట్‌లకు భయపడబోమన్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా దీక్షను అడ్డుకోలేరన్నారు. జైల్లో పెడితే కనీసం మంచినీళ్లు కూడా తీసుకోబోనని ప్రకటించారు. తుని ఘటనలో కేసులు ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ముద్రగడ ఆరోపించారు. అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోబోమన్నారు. తాను పిరికివాడిని కాదని… తన జాతికోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమన్నారు. […]
కాపుల అరెస్ట్‌కు నిరసనగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టారు. తన భార్యతో కలిసి ఇంట్లోనే దీక్షచేస్తున్నారు. అరెస్ట్‌లకు భయపడబోమన్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా దీక్షను అడ్డుకోలేరన్నారు. జైల్లో పెడితే కనీసం మంచినీళ్లు కూడా తీసుకోబోనని ప్రకటించారు. తుని ఘటనలో కేసులు ఎత్తివేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పిందని ముద్రగడ ఆరోపించారు.
అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా తెచ్చుకోబోమన్నారు. తాను పిరికివాడిని కాదని… తన జాతికోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమన్నారు. అరెస్ట్ చేయడమే కాకుండా కాపులపై రౌడీ షీటర్లు అన్నముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు కిర్లంపూడిలో టెన్షన్ వాతావరణం ఉంది. కిర్లంపూడికి వచ్చే దారులను పోలీసులు మూసివేశారు. ముద్రగడకు సంఘీభావం ప్రకటించేందుకు పెద్దెత్తున కాపులు వస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Click on Image to Read: