కోటీ యాభైలక్షల స్వామీజీ బస్సుకు పన్నురాయితీ
ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఒక విలాసవంతమైన బస్సును కొన్నాడు. వాష్‌రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర సకల వైభోగాలతో రూపొందిన ఈ బస్సు ఖరీదు కోటీ యాభైలక్షలు. ఈ బస్సు పర్మిట్‌కోసం అప్లై చేయగా ఆర్టీఓ అందరూ చెల్లించినట్లే రూ. 9.14 లక్షలు పన్ను కట్టమన్నాడు. కానీ స్వామీజీ చెల్లించలేదు. దాంతో రూ. 2.82 లక్షలు అపరాధ రుసుము విదించారు. అంటే మొత్తం రూ. 11.96 లక్షలు స్వామీజీ చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో స్వామీజీ స్వరూపానంద […]
ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి ఒక విలాసవంతమైన బస్సును కొన్నాడు. వాష్‌రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర సకల వైభోగాలతో రూపొందిన ఈ బస్సు ఖరీదు కోటీ యాభైలక్షలు. ఈ బస్సు పర్మిట్‌కోసం అప్లై చేయగా ఆర్టీఓ అందరూ చెల్లించినట్లే రూ. 9.14 లక్షలు పన్ను కట్టమన్నాడు. కానీ స్వామీజీ చెల్లించలేదు. దాంతో రూ. 2.82 లక్షలు అపరాధ రుసుము విదించారు. అంటే మొత్తం రూ. 11.96 లక్షలు స్వామీజీ చెల్లించాల్సిన పరిస్థితి.
దీంతో స్వామీజీ స్వరూపానంద సరస్వతి తనకు పన్నురాయితీ ఇవ్వాల్సిందని కోరుతూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు విజ్ఞప్తిచేశాడు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ స్వామీజీ కోరినట్లుగా మొత్తం పన్నురాయితీ ఇవ్వాలని తీర్మానించింది. సో… ఇక స్వామీజీ ఒక్క పైసా కట్టకుండా బస్సు టూర్‌కి వెళ్లవచ్చు.
గతంలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన విదేశీ లగ్జురీ కారుకు ఇలాగే పన్నురాయితీ పొందాడు.
Click on Image to Read: