కేసీఆర్ అపాయింట్‌మెంటు ఎందుకివ్వలేదంటే..?
తాను పోరుబాట పట్టడానికి కేసీఆర్ వ్యవహార శైలే కారణమని కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రజా సమస్యలపై చర్చిద్దామని తాను రెండు సార్లు ప్రయత్నించానని.. అయినా ఒక్కసారి కూడా కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు కోదండరాం. ఇక వేరే దారిలేక ఉద్యమాలకు దిగుతున్నానని ప్రకటించారు కోదండరాం. నిజంగా కోదండరాం, కేసీఆర్ మధ్య అంత అగాథం నెలకొందా? వారిద్దరి మధ్య విభేదాలు ఎందుకు పొడసూపాయి? ఉద్యమ సమయంలో భుజం భుజం కలుపుకుని కదనరంగంలో దూకిన వీరిద్దరూ […]
తాను పోరుబాట పట్టడానికి కేసీఆర్ వ్యవహార శైలే కారణమని కోదండరాం ప్రకటించిన సంగతి తెలిసిందే! ప్రజా సమస్యలపై చర్చిద్దామని తాను రెండు సార్లు ప్రయత్నించానని.. అయినా ఒక్కసారి కూడా కేసీఆర్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వెల్లడించారు కోదండరాం. ఇక వేరే దారిలేక ఉద్యమాలకు దిగుతున్నానని ప్రకటించారు కోదండరాం. నిజంగా కోదండరాం, కేసీఆర్ మధ్య అంత అగాథం నెలకొందా? వారిద్దరి మధ్య విభేదాలు ఎందుకు పొడసూపాయి? ఉద్యమ సమయంలో భుజం భుజం కలుపుకుని కదనరంగంలో దూకిన వీరిద్దరూ ఇప్పుడు ఉప్పు – నిప్పులా ఎందుకు మారారు? ఇలాంటి ప్రశ్నలు ప్రజల మనసుల్లో తలెత్తుతున్నాయి. వీటిన్నింటి వెనక కారణాలను ఒకసారి గుర్తుచేసుకుందాం.
ఉద్యమం హైజాగ్ అయిందని భావించారా?
తెలంగాణ పోరు ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో జేఏసీ వినూత్న నిరసనలు కొనసాగించింది. విద్యావంతులు, ఉద్యోగులు, నిరక్షరాస్యులు, కులసంఘాలను ఒక్కతాటిపై తెచ్చింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగర తీరం లాంటి భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కోదండరామ్. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు పదిజిల్లాల నుంచి జనం పోటెత్తారు. పోలీసులు అరెస్టులు చేసినా.. అడ్డుకున్నా ఆగలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన జనాల్ని.. వేలసంఖ్యలో ఉన్న పోలీసులు ఆపలేకపోయారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాను తనవైపు తిప్పుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ఓయూ, కేయూ జేఏసీలను తన అధీనంలోకి తెచ్చుకున్నారు. కానీ, జేఏసీని మాత్రం నియంత్రించలేకపోయారు. ఈ పరిణామాలు వారిద్దరి మధ్య దూరం పెంచాయని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తెలంగాణ ఆవిర్భావం తరువాత..!
తెలంగాణ రాష్ట్రం వచ్చాక జేఏసీ కొనసాగుతుందని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుందని కోదండరామ్ ప్రకటించడం కేసీఆర్ కు నచ్చలేదు. అందుకే, ఆయనకు దూరంగా ఉండసాగారు. ఈ విషయంలో కోదండరామ్‌కు అసంతృప్తి ఉన్నా.. ఆయన దాన్ని తెలివిగా బయటపెట్టారు. తెలంగాణ రాష్ట్రం తొలి అవతరణ దినోత్సవానికి ముందు.. ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి తలొగ్గిన కేసీఆర్ వెంటనే ప్రకటించారు. దీంతో కోదండరామ్ ప్రకటన చేస్తే.. కేసీఆర్ ఒప్పుకోవాల్సి వచ్చిందని అంతా అనుకున్నారు.. దీంతో కేసీఆర్ అహం దెబ్బతిన్నది. ఈ పరిణామం కూడా వారిద్దరి మధ్య దూరాన్ని మరింత పెంచింది. అదన్న మాట సంగతి.. అందుకే రెండుసార్లు అపాయింట్ మెంట్ అడిగినా తిరస్కరించారు కేసీఆర్.