ఫేస్ బుక్ సంఘంతో...బీ పాజిటివ్ అంటున్న అర్చకుడు!
తమిళనాడు, కాంచీ పురంలోని కామాక్షీ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సి ఆర్ నటరాజ శాస్త్రి (63) ఫేస్బుక్ ద్వారా తన లోని ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకుంటున్నారు. ఆయన అంతటితో ఆగకుండా ఫేస్బుక్ సంఘం అంటూ ఏర్పాటు చేసి, వీలయినంత ఎక్కువమంది ఒకచోట కలిసే ఏర్పాటు సైతం చేస్తున్నారు. గత ఏడాది ఫేస్బుక్ సంఘం తరపున దాదాపు 300మంది కాంచీపురంలో సమావేశం అయ్యారు. ఈ ఏడాది వచ్చేనెల 10న మరోసారి ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కామాక్షి ఆలయానికి సమీపంలో […]
తమిళనాడు, కాంచీ పురంలోని కామాక్షీ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సి ఆర్ నటరాజ శాస్త్రి (63) ఫేస్బుక్ ద్వారా తన లోని ఆధ్యాత్మిక ఆలోచనలను పంచుకుంటున్నారు. ఆయన అంతటితో ఆగకుండా ఫేస్బుక్ సంఘం అంటూ ఏర్పాటు చేసి, వీలయినంత ఎక్కువమంది ఒకచోట కలిసే ఏర్పాటు సైతం చేస్తున్నారు. గత ఏడాది ఫేస్బుక్ సంఘం తరపున దాదాపు 300మంది కాంచీపురంలో సమావేశం అయ్యారు. ఈ ఏడాది వచ్చేనెల 10న మరోసారి ఇలాంటి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కామాక్షి ఆలయానికి సమీపంలో వీరి సమావేశానికి ఒక హాలు కూడా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎలాంటి రుసుము ఉండదు. వసతి, భోజన సదుపాయాలు, ఆలయంలో దర్శనం మొదలైనవి ఉచితంగా కల్పిస్తారు. ప్రార్థనతో మొదలయ్యే సమావేశంలో పలు ఆధ్యాత్మిక అంశాలను చర్చిస్తారు. వచ్చినవారికి ఈ అంశాలపై పరీక్షలు కూడా నిర్వహిస్తారు.
బి పాజిటివ్ బ్లడ్ గ్రూపు కలిగిన శాస్త్రి…ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్…మతమేదైనా ఎవరికివారు తమ ఆలయాలకు వెళ్లాలని ఆయన సూచిస్తారు. ముఖ్యంగా ఆయన ఫేస్బుక్ ద్వారా మతాలన్నీ ఒక్కటే అనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా ఆయనకు 5వేలమంది స్నేహితులు ఉన్నారు. కనీసం 1800మంది ఫాలోయర్స్ ఉన్నారు. తన ఫేస్బుక్ స్నేహితుల కోసం పూజలు చేస్తానంటున్న శాస్త్రి…ఇదొక రకమైన మానసిక స్వస్థత అంటున్నారు.