కోమటిరెడ్డి వ్యవహారంలో ఇన్ని మలుపులెందుకు?
మాజీ మంత్రి కోమటిరెడ్డి పార్టీ మారే వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇంతకీ కోమటిరెడ్డి వ్యవహారంలో సొంత సోదరుడు రాజగోపాల్ రెడ్డితోపాటు, సీనియర్లంతా టీపీసీసీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై త్వరలోనే క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇచ్చుకునేలానే ఉంది పరిస్థితి. పార్టీలో కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టి.. ఆయన తప్పనిసరిగా సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరదామనుకున్న కోమటిరెడ్డి ఆ విషయాన్ని నేరుగా ప్రకటించలేదు. కానీ, […]
మాజీ మంత్రి కోమటిరెడ్డి పార్టీ మారే వ్యవహారం అనేక మలుపులు తిరిగి ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఇంతకీ కోమటిరెడ్డి వ్యవహారంలో సొంత సోదరుడు రాజగోపాల్ రెడ్డితోపాటు, సీనియర్లంతా టీపీసీసీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై త్వరలోనే క్రమశిక్షణ సంఘానికి వివరణ ఇచ్చుకునేలానే ఉంది పరిస్థితి. పార్టీలో కొనసాగాలనుకుంటున్నాడు కాబట్టి.. ఆయన తప్పనిసరిగా సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరదామనుకున్న కోమటిరెడ్డి ఆ విషయాన్ని నేరుగా ప్రకటించలేదు. కానీ, చేరడం లేదని స్పష్టం చేశాడు. దాని వెనక అనేక కారణాలు ఇవేనంటూ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే..
1. కోమటిరెడ్డిపై హైకోర్టులో కేసు..!
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన విద్యార్హతల విషయంలో వివాదం చెలరేగింది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో కేసు కొనసాగుతోంది. వచ్చేనెలలో దీనిపై తుదితీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇది వెంకటరెడ్డికి వ్యతిరేకంగా వస్తుందని ఆయన వర్గీయులు ఆందోళనలో ఉన్నారని, అదే గనక నిజమైతే ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వస్తుందన్న ప్రచారమూ ఉంది. అందుకే, ఆయన టీఆర్ఎస్‌లో చేరదామని నిర్ణయించుకున్నాడని.. అలాగైతే ఒకవేళ ఎమ్మెల్యే పదవి కోల్పోయినా.. ఏదో నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆయన భావించారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.
2. గుత్తా చేరడం ఇష్టం లేదా?
నల్లగొండ జిల్లాలో మంది, మార్బలం ఉన్న నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కారణాల దృష్ట్యా ఆయన అధికార పార్టీలో చేరితే ఆయనకు సముచిత ప్రాధాన్యం దక్కుతుందని భావించినట్లు తెలిసింది. ఈలోగా, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కారెక్కుతుండటంతో మరోసారి వర్గపోరు తప్పదని వెంకటరెడ్డి భావించి వెనుదిరిగాడని మరికొందరు నాయకులు అనుకుంటున్నారు.
3. సోనియా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందా?
కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారతారన్న విషయం ఉత్తమ్ హైకమాండ్‌కు తెలియజేశారు. దీనిపై సోనియా కార్యాలయ వర్గాలు వెంటనే వెంకటరెడ్డిని సంప్రదించినట్లు తెలిసింది. ఆయన పార్టీ మారకుండా ఆఫోన్ కాల్ ఆపిందని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. వారి సమాచారం ప్రకారం.. 2019 ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా నిలబెడతారన్న హామీ లభించిందని, అందుకే ఆయన కారెక్కే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా.. ముఖ్యమంత్రి రేసులో ఉండే అవకాశం దక్కడంతో ఆయన పార్టీలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నారని వెంకటరెడ్డి సన్నిహితులు చెబుతున్నారు.
Click on Image to Read: