చిన్న సినిమాకు బీబీసీ ప్రశంసలు
ఓ భారతీయ సినిమాను బీబీసీ మెచ్చుకుందంటే అది ఏ స్టారో హీరోదో అయి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ అందులో ఖాన్ హీరోలు లేరు. క్రేజీ డైరక్టర్ మూవీ అంతకంటే కాదు. భారీ బడ్జెట్ హంగులు మచ్చుకైనా కనిపించవు. అత్యంత సాధారణంగా తీసిన మరాఠీ సినిమా సైరాట్ ను బీబీసీ ఆకాశానికెత్తేస్తోంది. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి… సహజత్వం అంటే ఇది అంటూ పొగిడేస్తోంది. నిజమేమరి… కేవలం 4 కోట్లతో తెరకెక్కిన సినిమా ప్రస్తుతం […]
BY sarvi9 Jun 2016 4:00 AM IST
X
sarvi Updated On: 9 Jun 2016 4:24 AM IST
ఓ భారతీయ సినిమాను బీబీసీ మెచ్చుకుందంటే అది ఏ స్టారో హీరోదో అయి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తాం. కానీ అందులో ఖాన్ హీరోలు లేరు. క్రేజీ డైరక్టర్ మూవీ అంతకంటే కాదు. భారీ బడ్జెట్ హంగులు మచ్చుకైనా కనిపించవు. అత్యంత సాధారణంగా తీసిన మరాఠీ సినిమా సైరాట్ ను బీబీసీ ఆకాశానికెత్తేస్తోంది. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి… సహజత్వం అంటే ఇది అంటూ పొగిడేస్తోంది. నిజమేమరి… కేవలం 4 కోట్లతో తెరకెక్కిన సినిమా ప్రస్తుతం 85కోట్ల రూపాయలు వసూలు చేస్తోందంటే మామూలు విషయం కాదు. భాషతో సంబంధం లేకుండా ఆలిండియా లెవెల్లో ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అవుతున్నారంటే కచ్చితంగా అందులో మేజిక్ ఉండే ఉంటుంది. ఆ మేజిక్కే బీబీసీని కూడా ఎట్రాక్ట్ చేసింది. దర్శకుడు నాగరాజ్ తెరకెక్కించిన ఈ విఫల ప్రేమగాథ… మరాఠీల మనసు కొల్లగొడుతోంది.
చిన్న చిన్న టౌన్స్ లో కూడా రోజుకు ఆరు షోలు వేస్తున్నా కూడా థియేటర్స్ నిండిపోతున్నాయి. రిపీట్ ఆడియెన్స్ కి లెక్కేలేదు. ట్రాక్టర్లు, బండ్లు కట్టుకుని వస్తున్నారట. ఇప్పటికే 85కోట్ల కలెక్షన్స్ దాటింది. ఇక దుబాయ్ లో కూడా ఏమరాఠీ సినిమాకు రానన్ని కలెక్షన్స్ వచ్చాయట. కారణం సబ్ టైటిల్స్ తో ఇండియన్ ఆడియెన్స్ మొత్తం ఈమూవీని చూసేందుకు ఎగబడుతున్నారు. అందుకే ఈ సినిమాను స్లీపింగ్ హిట్ గా చెప్పుకొచ్చింది బీబీసీ. భారత్ లో ప్రేమించాలంటే పెద్దల అనుమతి ఉండాలి. ఎలా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలనే రూల్స్ ఇండియాలోనే ఉంటాయి. తక్కువ కులంలో పుడితే ఎవ్వరికైనా ప్రేమ అందదు. అందినా అది విజయం వైపు సాగదు. ప్రతి ప్రేమకు ట్రాజెడీనే ముగింపు ఉంటుందని అద్బుతంగా బీబీసీ కథనం ప్రసారం చేసింది. సైరాట్ సినిమా ఇంటర్వెల్ వరకు మహారాష్ట్ర లోని ఓ గ్రామంలో తీస్తే ఆ తర్వాత మొత్తం హైదరాబాద్ లోనే షూట్ చేశాడు డైరెక్టర్.
Next Story