చివరికి బాబుమోహన్ కూడా విమర్శించేశాడు!
నటుడు, తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌కి జంప్ చేసిన బాబుమోహన్ కూడా ప్రొఫెసర్ కోదండరాంకి నీతిబోధచేశాడు. ప్రత్యేక తెలంగాణకోసం ఏర్పడిన రాజకీయ జేఏసీ ఆపని పూర్తి అయింది కాబట్టి ఇక జేఏసీ ఎక్కడుందని ప్రశ్నించాడు. కాంగ్రెస్ ఇచ్చే డబ్బులకోసం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించాడు. కోదండరాం తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు. ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ విజయం చూసి కేసీఆర్ పట్ల ప్రజలు ఎంత నమ్మకంతో వున్నారో గుర్తించాలని, ప్రభుత్వం మీద కోదండరాం అర్ధరహితమైన, […]

నటుడు, తెలుగుదేశం నుంచి టీఆర్‌ఎస్‌కి జంప్ చేసిన బాబుమోహన్ కూడా ప్రొఫెసర్ కోదండరాంకి నీతిబోధచేశాడు. ప్రత్యేక తెలంగాణకోసం ఏర్పడిన రాజకీయ జేఏసీ ఆపని పూర్తి అయింది కాబట్టి ఇక జేఏసీ ఎక్కడుందని ప్రశ్నించాడు. కాంగ్రెస్ ఇచ్చే డబ్బులకోసం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించాడు. కోదండరాం తన నోటిని అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చాడు.
ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ విజయం చూసి కేసీఆర్ పట్ల ప్రజలు ఎంత నమ్మకంతో వున్నారో గుర్తించాలని, ప్రభుత్వం మీద కోదండరాం అర్ధరహితమైన, అవాస్తవికమైన వ్యాఖ్యలు మానుకొని తన గౌరవాన్ని నిలుపుకోవాలని నీతి సూక్త ముక్తావళి జపించాడు.
Click on Image to Read: