నా వెనక ఎవరూ లేరు!
తనపై తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తోన్న విమర్శలపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పందించారు. తను ఎవరో రెచ్చగొడితే.. చెలరేగిపోయేవాడిని కాదని స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అంటూ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ ఆయనపై విమర్శల దాడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ ఏజెంటని, ఆయన వెనక ఉన్న పెద్దలెవరో మాకు తెలుసని టీఆర్ ఎస్ మంత్రులు మండిపడ్డారు. వరుసగా కేబినెట్ మంత్రులంతా కోదండరామ్‌పై విరుచుకుపడటంతో ఆయన […]
తనపై తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తోన్న విమర్శలపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ స్పందించారు. తను ఎవరో రెచ్చగొడితే.. చెలరేగిపోయేవాడిని కాదని స్పష్టం చేశారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం అంటూ కోదండరామ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ ఆయనపై విమర్శల దాడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ ఏజెంటని, ఆయన వెనక ఉన్న పెద్దలెవరో మాకు తెలుసని టీఆర్ ఎస్ మంత్రులు మండిపడ్డారు. వరుసగా కేబినెట్ మంత్రులంతా కోదండరామ్‌పై విరుచుకుపడటంతో ఆయన ఏం చెప్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలోనే కోదండరామ్ స్పందించారు. సర్కారుపై తన తిరుగుబాటుపై వివరణ ఇచ్చారు.
భూ పోరాటాల వైపు అడుగులు..
ఇప్పటికే మూడు వంతుల జీవితం ముగిసిపోయింది. ఇక మిగిలింది పావలావంతే.. ఈ శేష జీవితాన్ని ప్రజల బాగు కోసం పాటుపడేందుకే వెచ్చిస్తానని ప్రకటించారు. తెలంగాణలో ప్రజలకు కేవలం అభివృద్ధి మాత్రమే కావాలని, ఇంకేం అక్కర్లేదని స్పష్టం చేశారు. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికే మా పోరాటం అని స్పష్టం చేశారు. జేఏసీ నేరుగా చెప్పకపోయినా.. తెలంగాణలో భూ నిర్వాసితులపైనే కోదండరామ్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో రెండు విషయాలు కీలకమైనవి. ఒకటి తెలంగాణలో సింగరేణి ఓపెన్ కాస్టులు. రెండోది.. తెలంగాణ సర్కారు చేపట్టనున్న నీటి ప్రాజెక్టులు. ఈ రెండు తెలంగాణకు కీలకమైనవే. ఈ రెండింటికి భూసేకరణ చేయడం ప్రభుత్వానికి తప్పనిసరి.
ప్రతిపక్షాలు రెండేళ్లుగా ప్రజలకు చేరువ కాదు కదా..కనీసం మీడియాలో పడే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రజాపోరాటాలను సమర్థంగా నడిపిన నాయకుడిగా కోదండరామ్ కు మౌలిక సమస్యలపై బాగా పట్టు ఉంది. అందుకే ఆయన భూ నిర్వాసితుల తరఫున పోరాడాలని నిర్ణయించారు. అందుకే ముందస్తుగా వీరిపై దృష్టి సారించారు. తొలుత మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బాధితులను పరామర్శించారు. తరువాత ఆదిలాబాద్‌లో సింగరేణి ఓపెన్ కాస్టు లకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. అక్కడా ఇదే మాట చెప్పారు. మొత్తానికి కోదండరామ్ చర్యలు.. ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నాయి.