అమరావతి కాదు... అణుబాంబుల తయారీ కేంద్రమట..!
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం…ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతుండటం తెలుగు ప్రజులు కళ్లారా చూస్తున్నారు. ఉద్యోగులకు తగిన బిల్డింగులు, మౌలిక వసతులు ఇవ్వలేక ప్రభుత్వం కిందా మీదా పడుతుంటే, పాకిస్తాన్‌లో అమరావతిపై ఒక పుకారు షికారు చేస్తోంది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఒక మెగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని నిర్మించనున్నారని పాక్లో ప్రచారం జరుగుతోంది. బుద్దుల ప్రాచీన గ్రామం అమరావతి పేరుని రాజధానికి పెట్టడం, అక్కడకు తరచుగా చైనా, జపాన్, […]
ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణం…ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతుండటం తెలుగు ప్రజులు కళ్లారా చూస్తున్నారు. ఉద్యోగులకు తగిన బిల్డింగులు, మౌలిక వసతులు ఇవ్వలేక ప్రభుత్వం కిందా మీదా పడుతుంటే, పాకిస్తాన్‌లో అమరావతిపై ఒక పుకారు షికారు చేస్తోంది. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఒక మెగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ని నిర్మించనున్నారని పాక్లో ప్రచారం జరుగుతోంది.
బుద్దుల ప్రాచీన గ్రామం అమరావతి పేరుని రాజధానికి పెట్టడం, అక్కడకు తరచుగా చైనా, జపాన్, సింగపూర్లనుండి పలురకాల బృందాలు వచ్చి వెళుతుండటం, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ కంపెనీ మాకీ అండ్ అసోసియేట్స్ రాజధాని కోసం న్యూక్లియర్ టవర్ని పోలివున్నడోమ్ డిజైన్ని ఇవ్వటం….ఇవన్నీ కలిసి పాక్లో ఇలాంటి సందేహాలకు తావిచ్చాయి. అమెరికా సహాయంతో అక్కడ హైడ్రోజన్ బాంబులు తయారుచేస్తారని పాక్లో చెప్పుకుంటున్నారు. నిజానికి ఎపి ప్రభుత్వం ఆ డిజైన్ని మార్చి కొత్తదాన్ని తయారుచేయమని మాకీ…కంపెనీని కోరింది. పాకిస్తాన్లో ఒక టివి ఛానల్ చర్చా కార్యక్రమంలో ఈ సందేహాలను వక్తలు వ్యక్తం చేశారు.
ఒక తెలుగు ఛానల్ ఆ కార్యక్రమంలోని భాగాన్ని మంగళవారం రాత్రి ప్రసారం చేసింది. దాంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏదిఏమైతేనేం…భారత్నుండి ఆపదలనే శంకించే పాక్కి అమరావతి అలా భయాన్ని పుట్టించింది. అయితే ఆఫీస్ బిల్డింగులే పూర్తికాక, మౌలిక వసతులు లేక ఒక పక్క జనం ఇబ్బందులు పడుతుండగా..ఇలాంటి పుకార్లను వినటం తెలుగు ప్రజలకు కాస్త హాస్యాస్పదంగానే ఉంటుంది మరి.
Click on Image to Read: