నన్ను కొనలేరు కాబట్టే కక్ష కట్టారు... ఓట్ల కోసం వెళ్తే పేడనీళ్ల సన్మానం తప్పదు
ముఖ్యమంత్రి చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తండ్రికొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని దోచుకుంటూ పెద్దపెద్ద భవనాలు కట్టుకుంటున్నారని పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరుచేయడం లేదన్నారు. మిగులు ఉన్న పక్క రాష్ట్రం ఒకరోజు వేడుక చేసుకుంటే…రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తండ్రికొడుకులు మాత్రం వారం పాటు సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కనీసం విచారణ జరిపించలేదు. వారి ఉసురు మీకు […]
ముఖ్యమంత్రి చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దోచేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తండ్రికొడుకులు ఇద్దరూ రాష్ట్రాన్ని దోచుకుంటూ పెద్దపెద్ద భవనాలు కట్టుకుంటున్నారని పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా మంజూరుచేయడం లేదన్నారు. మిగులు ఉన్న పక్క రాష్ట్రం ఒకరోజు వేడుక చేసుకుంటే…రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తండ్రికొడుకులు మాత్రం వారం పాటు సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
నారాయణ కాలేజీల్లో ఎంతో మంది విద్యార్థులు చనిపోతే కనీసం విచారణ జరిపించలేదు. వారి ఉసురు మీకు తగిలి తీరుతుందని రోజా అన్నారు. బెల్ట్ షాపులు నిర్మూలించాలి లేకుంటే వాటిని తామే పగులగొడుతామని రోజా హెచ్చరించారు. తాగండి, పేకాడండి ఉల్లాసంగా ఉండండి అని ఒక సీఎం చెప్పడం దారుణమన్నారు. చంద్రబాబు తలతిక్క మాటలు మానాలని కోరారు. లేకుంటే మహిళల చేతిలో చీపురు దెబ్బలు తినాల్సి ఉంటుందన్నారు. మిలిగిన ఎమ్మెల్యేల్లాగా తనను కొనలేరు కాబట్టే అసెంబ్లీ నుంచి బయటకు పంపారని రోజా మండిపడ్డారు.
ఈసారి టీడీపీనేతలు ఓట్లు అడిగేందుకు వెళ్తే మహిళలు పేడనీళ్లతో సన్మానం చేస్తారని రోజా అన్నారు. ఆడపిల్ల పుడితే రూ. 25వేలు డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్కరికైనా డిపాజిట్ చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు లెక్కలో ఏపీలో ఒక్క ఆడబిడ్డ కూడా పుట్టలేదా అని నిలదీశారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని రోజా మండిపడ్డారు.
Click on Image to Read: