అమరవీరుల త్యాగాలను అవమానిస్తావా కవితా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకోసం ప్రాణాలు ధారపోసిన అమరవీరులకు నివాళులర్పించారు. అంతవరకు బాగానే వుంది. అయితే తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన అవతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడిని ఆహ్వానించడం అమరవీరులను అవమానించడమేనని తెలంగాణవాదులు బాధపడుతున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీని లక్షనాగళ్లతో దున్నిస్తానన్న తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫిల్మ్‌సిటీకి వెళ్లి పొగడ్తలు, వరాలు కురిపించి […]

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణకోసం ప్రాణాలు ధారపోసిన అమరవీరులకు నివాళులర్పించారు. అంతవరకు బాగానే వుంది. అయితే తెలంగాణ జాగృతి యూనైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన అవతరణ వేడుకలకు ముఖ్య అతిధిగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడిని ఆహ్వానించడం అమరవీరులను అవమానించడమేనని తెలంగాణవాదులు బాధపడుతున్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీని లక్షనాగళ్లతో దున్నిస్తానన్న తండ్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఫిల్మ్‌సిటీకి వెళ్లి పొగడ్తలు, వరాలు కురిపించి వచ్చాడని, కూతురు కవిత వచ్చే ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడిని, వైఎస్ జగన్‌ను ముఖ్య అతిధులుగా ఆహ్వానిస్తే సమంజసంగా వుంటుందని కొందరు తెలంగాణవాదులు ఫేస్‌బుక్ లలో కామెంట్లు పెట్టడం విశేషం.
Click on Image to Read: