చినబాబు పోటు...బయటకొచ్చి వాపోయిన కొమ్మినేని
ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాస్‌రావు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. ఎన్టీవీలో రోజూ ఉదయం కేఎస్‌ఆర్ లైవ్ షో పేరుతో కొమ్మినేని చర్చాకార్యక్రమం నిర్వహించేవారు. అయితే కొంతకాలంగా ఆయన్ను యాజమాన్యం సదరుకార్యక్రమం నుంచి పక్కనపెట్టింది. ఇందుకు కారణం లోకేష్ బాబేనని చెబుతుంటారు. లైవ్ షోలో తన తండ్రి పాలనపై విమర్శలు చేయడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఛానల్ యాజమాన్యం బలహీనతలను ఆసరగా చేసుకుని కొమ్మినేనిపై వేటు వేయించారు. […]
ఎన్టీవీలో చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాస్‌రావు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. ఎన్టీవీలో రోజూ ఉదయం కేఎస్‌ఆర్ లైవ్ షో పేరుతో కొమ్మినేని చర్చాకార్యక్రమం నిర్వహించేవారు. అయితే కొంతకాలంగా ఆయన్ను యాజమాన్యం సదరుకార్యక్రమం నుంచి పక్కనపెట్టింది. ఇందుకు కారణం లోకేష్ బాబేనని చెబుతుంటారు. లైవ్ షోలో తన తండ్రి పాలనపై విమర్శలు చేయడాన్ని లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఛానల్ యాజమాన్యం బలహీనతలను ఆసరగా చేసుకుని కొమ్మినేనిపై వేటు వేయించారు. ఆ తర్వాత సదరు చర్చకార్యక్రమంలోనూ చాలా మార్పు వచ్చింది.
ప్రభుత్వం తప్పిదాలపై కాకుండా ప్రతిపక్ష తీరుతెన్నులపైనే సదరు ఛానల్ ఎక్కువగా చర్చ నిర్వహిస్తోంది. ఫోన్‌లైన్లలో కూడా టీడీపీకి అనుకూలమైన గొంతులే వినిపిస్తుండడం కూడా కొత్తగా వచ్చిన మార్పు. ఇదంతా లోకేష్ మహిమేనని అంటుంటారు. ఒక దశలో ఎన్టీవీ ప్రసారాలను ఏపీలో అధికార పార్టీ దాదాపు నిషేధించింది. తాను ఎన్టీవీ నుంచి వైగొలిగినట్టు ప్రకటించిన కొమ్మినేని… అందుకు కారణం కూడా వివరించారు. దురదృష్టవశాత్తు ప్రభువుల్లో ప్రజాస్వామ్యస్పూర్తి లోపించిందని వాపోయారు. కేఎస్‌ఆర్ చర్చ నుంచి తనను పక్కన పెట్టినప్పటికీ… కొంతకాలం వేచి చూడాలనుకున్నానని… అయితే చివరకు ఆత్మగౌరవమే ప్రధానమన్న ఉద్దేశంతో ఎన్టీవీకి రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అయినా కొమ్మినేని శ్రీనివాసరావు నిత్యం టీవీలో కనిపించేవారు కాబట్టి ఆయన కనిపించకపోయే సరికి చర్చనీయాంశమైంది. కానీ లోకేష్ బాబు లాంటి వారి ఇగోలకు, యాజమాన్యం పోకడలకు బలైపోయిన జర్నలిస్టులు వందల మందే ఉన్నారు.
Click on Image to Read: