షాకిచ్చిన కోమటిరెడ్డి కామెంట్స్! ఆ ఇద్దరికి కూడా షోకాజ్ నోటీస్ ఇస్తారా ?
మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి మారతాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న వేళ తాజాగా ఆయన చేసిన కామెంట్లు షాకిచ్చాయి. తానెందుకు పార్టీ మారాలి? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడంతో టీపీసీసీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. తాను మాట్లాడినదాంట్లో తప్పేంటి? అని ఎదురు తిరగడంతో కోమటిరెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కామన్ అంటూ ఆయన తనను తాను సమర్థించుకున్నారు. […]
BY sarvi7 Jun 2016 2:30 AM IST
X
sarvi Updated On: 7 Jun 2016 6:19 AM IST
మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ నుంచి అధికార పార్టీలోకి మారతాడంటూ ఊహాగానాలు ఊపందుకున్న వేళ తాజాగా ఆయన చేసిన కామెంట్లు షాకిచ్చాయి. తానెందుకు పార్టీ మారాలి? అంటూ ఆయన ఎదురు ప్రశ్నించడంతో టీపీసీసీ, సీనియర్ కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. తాను మాట్లాడినదాంట్లో తప్పేంటి? అని ఎదురు తిరగడంతో కోమటిరెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కామన్ అంటూ ఆయన తనను తాను సమర్థించుకున్నారు. టీపీసీసీ నేతలను విమర్శించినందుకు తన షోకాజ్ జారీ చేసిన విషయంలోనూ ఆయన మరోసారి ఎదురుదాడికి దిగారు. పాల్వాయి గోవర్దన్ రెడ్డి, సర్వే సత్యనారాయణలు సీనియర్ నేత జానారెడ్డిని అనేక సార్లు బహిరంగంగా విమర్శించారు కదా! మరి వారికెందుకు షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని మెలిక పెట్టారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక విలేకరులు, కాంగ్రెస్ నాయకులు జుట్టుపీక్కున్నారు. ఇప్పుడున్న సీనియర్ నాయకులంతా ఏదో పార్టీ నుంచి వచ్చినవారే.. కానీ ప్రాణమున్నంత వరకు కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.
రాజగోపాలే అడ్డుపడ్డాడా?
పార్టీ మారే విషయంలో కోమటిరెడ్డి వ్యవహారం యూటర్న్ తీసుకున్నాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావులతోపాటు కోమటిరెడ్డి సోదరులు జూన్ 6వ తేదీకి అటూ ఇటూగా పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. వీరిలో కోమటిరెడ్డి మినహా మిగిలినవారెవరూ ఈ వ్యాఖ్యల్ని ఖండించలేదు. కోమటిరెడ్డి పార్టీ మారే వ్యవహారం ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వల్లే నిలిచిపోయిందని కూడా చెప్పుకుంటున్నారు. ఆయన నచ్చజెప్పడంతోనే పార్టీ మారే విషయంలో కోమటిరెడ్డి పునరాలోచనలో పడ్డాడని అనుకుంటున్నారు. కోమటిరెడ్డి తాను పార్టీ మారడం లేదంటూ అనూహ్య వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. పార్టీని బహిరంగ వేదికలపై తీవ్ర పదజాలంతో విమర్శించిన పాల్వాయి, సర్వే లాంటికి ఒక న్యాయం, తనకో న్యాయమా? అంటూ ప్రశ్నించిన కోమటిరెడ్డి పాయింట్లోనూ న్యాయం ఉంది. గతంలో బీసీ నేత వకుళాభరణం కూడా ఇదే పాయింట్ లేవదీశారు. అప్పుడు ఉత్తమ్ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ మారారు. రాజగోపాల్ ఏఐసీసీ సభ్యుడుకావడం వల్ల అధిష్టానం వద్ద అన్న గురించి వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వగలడు. ఇప్పుడు కోమటిరెడ్డి ప్రశ్నలకు ఉత్తమ్ సమాధానం చెబుతారా? లేదంటే.. పాల్వాయి, సర్వేలకు కూడా షోకాజ్ ఇస్తాడా? మొత్తానికి తనకు షోకాజ్ ఇచ్చిన ఉత్తమ్ కు భలే మెలికపెట్టాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
Next Story