విదేశీ పర్యటన తరువాత కోదండరామ్‌లో మార్పు?
విదేశీ పర్యటన తరువాత కోదండరామ్ ఆలోచన, కామెంట్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మే మొదటివారంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ పలువురు ప్రవాస తెలంగాణ ప్రజలను కలుసుకున్నారు. దాదాపు 22 రోజుల సుదీర్ఘ పర్యటన తరువాత హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చీరాగానే.. ఆయన సంచలన కామెంట్లు చేశారు. విదేశాల్లో చాలామంది ప్రముఖులు జేఏసీని పూర్తి స్థాయి రాజకీయ శక్తిగా చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. దీంతో టీఆర్ ఎస్ లో అంతర్మథనం మొదలైంది. అంతకముందు ఒక […]
BY sarvi7 Jun 2016 3:38 AM IST
X
sarvi Updated On: 7 Jun 2016 6:25 AM IST
విదేశీ పర్యటన తరువాత కోదండరామ్ ఆలోచన, కామెంట్లలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మే మొదటివారంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ పలువురు ప్రవాస తెలంగాణ ప్రజలను కలుసుకున్నారు. దాదాపు 22 రోజుల సుదీర్ఘ పర్యటన తరువాత హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చీరాగానే.. ఆయన సంచలన కామెంట్లు చేశారు. విదేశాల్లో చాలామంది ప్రముఖులు జేఏసీని పూర్తి స్థాయి రాజకీయ శక్తిగా చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. దీంతో టీఆర్ ఎస్ లో అంతర్మథనం మొదలైంది. అంతకముందు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే.. తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో మెజారిటీ వంతు జేఏసీ నుంచి తప్పుకున్నాయి. తెలంగాణ కల సాకారం కోసం జేఏసీతో కలిసి పనిచేశామని, ఇప్పుడు దాని అవసరం లేదని శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు. ఈ పరిణామంపై జేఏసీ ఎలాంటి వ్యతిరేక ప్రచారం చేయలేదు. కాకుంటే ఉన్నవారితో కలిసి సాగుతామని ప్రకటించింది. బయటికి చెప్పకున్నా జేఏసీ నుంచి ఉద్యోగ సంఘాలు బయటికి రావడం కోదండరామ్ కు అస్సలు నచ్చలేదని సమాచారం.
ఇదే సమయంలో ఆయన చేపట్టిన విదేశీ పర్యటనలోనూ పలువురు జేఏసీని రాజకీయ శక్తిగా చూడాలనుకున్నట్లు తమ అభిలాషను ఆయన ముందు వ్యక్త పరిచారు. మేం మీకు అండగా ఉంటాం. మీరు పార్టీ పెట్టండి..అని చాలామంది కోరినట్లు కోదండరాం స్వయంగా వెల్లడించడం ఇక్కడ గమనార్హం. తెలంగాణలో జేఏసీని శాశ్వతంగా కొనసాగించాలని కోదండరామ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే దానికి ఇప్పుడు శాశ్వత రూపం ఇచ్చే పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. పూర్తి రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందా? లేక పాత పంథాలోనే ముందుకుపోతుందా? అన్నది కోదండరామ్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై పోరాడుతామని ప్రకటించిన కోదండరామ్ తప్పకుండా ఏదో ప్రకటన చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Next Story