బాహుబలి 2లో భారీ క్లయిమాక్స్ సీన్స్ ?
ఏ సినిమా అయినా ఆఖరి 15 నిమిషాల్లో క్లయిమాక్స్ కు వస్తుంది. యాక్షన్ సినిమాలైతే.. లాస్ట్ లో 10నిమిషాలు ఫైట్లు పెట్టి సినిమాను ముగిస్తారు. కానీ బాహుబలి-2 సినిమా మాత్రం టోటల్ క్లైమాక్స్ ఎపిసోడే అర్థ గంట ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ 30నిమిషాల సన్నివేశాల చిత్రీకరణ కోసం 10 వారాల షూటింగ్ షెడ్యూల్ ఏర్పాటుచేసారట. ఈనెల 13 నుంచి బాహుబలి పార్ట్-2కు సంబంధించి క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేశారు. ఏకంగా 10వారాల పాటు… అంటే 70 […]
ఏ సినిమా అయినా ఆఖరి 15 నిమిషాల్లో క్లయిమాక్స్ కు వస్తుంది. యాక్షన్ సినిమాలైతే.. లాస్ట్ లో 10నిమిషాలు ఫైట్లు పెట్టి సినిమాను ముగిస్తారు. కానీ బాహుబలి-2 సినిమా మాత్రం టోటల్ క్లైమాక్స్ ఎపిసోడే అర్థ గంట ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ 30నిమిషాల సన్నివేశాల చిత్రీకరణ కోసం 10 వారాల షూటింగ్ షెడ్యూల్ ఏర్పాటుచేసారట. ఈనెల 13 నుంచి బాహుబలి పార్ట్-2కు సంబంధించి క్లైమాక్స్ షూట్ ప్లాన్ చేశారు. ఏకంగా 10వారాల పాటు… అంటే 70 రోజుల పాటు కేవలం క్లయిమాక్స్ సన్నివేశాలే తీస్తారట. ఈ టైమ్ లో ఏకంగా ఓ సినిమానే తీసేయొచ్చు. బిజినెస్ మేన్ సినిమాను పూరీ జగన్నాధ్ కేవలం 45 రోజుల్లో పూర్తిచేశాడు. కానీ బాహుబలి-2 క్లయిమాక్స్ కు మాత్రం 70రోజులు టైం తీసుకోవడానికి కారణం ఉంది. ఇది ఆషామాషీ క్లయిమాక్స్ కాదు… 30 నిమిషాల పాటు సినిమాలో కేవలం యుద్ధాలే ఉంటాయట. ఆ యుద్ధ సన్నివేశాల్నే 70 రోజుల పాటు తీయాలని నిర్ణయించుకున్నారు. పార్ట్-2లో మ్యాగ్జిమమ్ యుద్ధాలే ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి కూడా స్పష్టంచేశాడు. 2 గంటల 30నిమిషాల సినిమాలో పాటలకు 25 నిమిషాలు తీసేస్తే… మిగతా రన్ టైమ్ లో దాదాపు 70శాతం యుద్ధాలే ఉంటాయి. అందులో ఆఖరి 30నిమిషాల్లో కేవలం యుద్ధాలే ఉంటాయని తెలుస్తోంది. బాహుబలి-2ను ఈ ఏడాదిలో కాకుండా వచ్చే ఏడాది విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం ఇదేనని తెలుస్తోంది.