అన్నను ఇంట్లో పెట్టుకుని... జగన్‌పై ఆనం ఘాటు విమర్శలు
ఆనం వివేకానందరెడ్డి సోదరుడు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి… జగన్ తీరుపై మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి భాషను వాడేవారిని 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సభ్యతగా మాట్లాడే వారిమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతిపక్షనాయకుడిని చూడాల్సి రావడం చాలా బాధగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు సంస్కారవంతంగా వ్యవహరించాలని చెప్పారు. రాజకీయాల్లో ఉండే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్‌ను తాము కూడా అంతకంటే పదునైన భాషతో తిట్టగలమని కానీ తమకు […]
ఆనం వివేకానందరెడ్డి సోదరుడు మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి… జగన్ తీరుపై మండిపడ్డారు. రాజకీయాల్లో ఇలాంటి భాషను వాడేవారిని 35 ఏళ్ల తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సభ్యతగా మాట్లాడే వారిమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతిపక్షనాయకుడిని చూడాల్సి రావడం చాలా బాధగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉన్న వారు సంస్కారవంతంగా వ్యవహరించాలని చెప్పారు. రాజకీయాల్లో ఉండే అర్హత జగన్‌కు లేదన్నారు. జగన్‌ను తాము కూడా అంతకంటే పదునైన భాషతో తిట్టగలమని కానీ తమకు సభ్యత అడ్డువస్తోందన్నారు. మరోసారి ఇలాంటి భాషా వాడవద్దని హెచ్చరించారు.
ఆనం రామనారాయణరెడ్డి జగన్ వ్యాఖ్యలను తప్పుపట్టడం బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో ప్రెస్‌మీట్ పెడితే వాడకూడని మాటలు, చేయకూడని వ్యాఖ్యలు చేసే వారిలో ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డి అందరి కంటే ఫస్ట్ ఉంటారు. చీరలుకట్టుకుని తిరగడం, ప్రెస్‌మీట్లలో సిగరెట్టు తాగడం, చొక్కాకు బటన్లు పెట్టుకోకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, వీధుల్లోకి వెళ్లి మహిళలపై జోకులు వేయడం వంటి అలవాట్లు ఆనం వివేకాకు కామన్. అలాంటి పనులు చేసే అన్నను ఇంట్లో పెట్టుకుని పక్కవాళ్లను విమర్శించడం విచిత్రమే. రాజకీయాలు అంతేమరీ.
Click on Image to Read: